Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం

న్యూదిల్లీ: సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. మంగళవారం నుంచి రోజువారీ కార్యకలాపాలను సుప్రీం కోర్టు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసారం చేస్తోంది. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల్ని మాత్రమే యూట్యూబ్‌లో చూసే వీలు కల్పించిన సుప్రీంకోర్టు… త్వరలోనే ఇందుకోసం సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది. కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలో గత మంగళవారం జరిగిన ఫుల్‌ కోర్ట్‌ సమావేశంలో నిర్ణయించారు. ప్రత్యక్ష ప్రసారం చేయడంపై న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. https://main.sci.gov.in/ display-board, https://webcast.gov.in/scindiaలో వేర్వేరు ధర్మాసనాల విచారణల ప్రత్యక్ష ప్రసారం లింకులు అందుబాటులో ఉంటాయి. అయితే అత్యున్నత న్యాయస్థానంలో జరిగే కార్యకలాపాల కాపీరైట్‌ హక్కులను యూట్యూబ్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించ కూడదంటూ బీజేపీ మాజీ నేత కేఎన్‌ గోవిందాచార్య తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వెబ్‌కాస్ట్‌పై కాపీరైట్‌ హక్కులను యూట్యూబ్‌ స్పష్టంగా కోరినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం… ప్రస్తుతం ప్రారంభ దశలోనే యూట్యూబ్‌ ఉపయోగిస్తామని తెలిపింది. కాపీరైట్‌ సమస్యలపై దృష్టిసారిస్తామని పేర్కొంటూనే, ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రత్యేకంగా సొంత వేదిక ఏర్పాటు చేస్తామని వెల్లడిరచింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 17కు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img