Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

సెకెండ్‌ వేవ్‌తో పోలిస్తే థర్డ్‌వేవ్‌ అంత తీవ్రంగా ఉండదు

ఐసీఎంఆర్‌ వెల్లడి
కరోనా థర్డ్‌వేవ్‌పై శాస్త్రవ్తేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని తెలిపారు. సెకెండ్‌ వేవ్‌తో పోలిస్తే థర్డ్‌ వేవ్‌ అంత తీవ్రంగా ఉండదని ఐసీఎంఆర్‌ నిపుణులు చెబుతున్నారు.కరోనా థర్డ్‌ వేవ్‌ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేరని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల జిల్లాల వారీగా కరోనా పరిస్థితుల డేటాను పరిశీలించి శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారని ఐసీఎంఆర్‌కి చెందిన డాక్టర్‌ సమిరన్‌ పాండా తెలిపారు. ఇమ్యూనిటీ పవర్‌ పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఏర్పడుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img