Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

స్వాతంత్య్ర వేడుకలకు లష్కరే, జైషే నుంచి ఉగ్రముప్పు..!

అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో
ఎర్రకోట వద్ద ఎంట్రీ నిబంధనలు కఠినతరం చేయాలని సూచన

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ నుంచి స్వాతంత్య్ర వేడుకలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పది పేజీల నివేదికను ఢల్లీి పోలీసులతో పంచుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ఎంట్రీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అందులో సూచించింది. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్యతోపాటు ఉదయ్‌పూర్‌, అమరావతి ఘటనలను కూడా అందులో ప్రస్తావించింది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్‌లోని పెద్ద నేతలను టార్గెట్‌ చేయాలని పాక్‌ ఐఎస్‌ఐ నుంచి లష్కరే, జీఈఎంకు ఆదేశాలు అందాయని, అంతేకాకుండా వారికి లాజిస్టిక్‌ సపోర్ట్‌ కూడా అందించినట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img