జగన్‌ను నిలదీసిన రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు చేతనైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలపై పోరాడాలంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు చేసిన సవాల్‌కు సీఎం వైఎస్ జగన్ సమాధానమివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రామకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని, వ్యవసాయ, పారిశ్రామిక, కుదేలయ్యాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదు? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న విషయం ఏమైంది? విభజన చట్ట హామీల అమలు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి నిధుల సంగతేమైంది? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు జరగలేదు? కనీసం కేంద్ర బడ్జెట్లలో రాష్ట్రానికి నిధులు కేటాయించేలా ఎందుకు ప్రయత్నించలేదు? కేంద్రంపై ఒత్తిడి పెంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోయారు? ‘మాట తప్పి, మడమ తిప్పడం’ తప్ప జగన్ ఈ నాలుగేళ్లలో ఏమి సాధించారు’ అని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రానికి అడుగడుగునా ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు దాసోహమనడం తప్ప వైసీపీ ఎంపీలు చేసిందేమీ లేదని విమర్శించారు. అదానీ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నప్పటికీ మీరెందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రజల ఆస్తులను కారుచౌకగా అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు ఎద్దేవా చేస్తుంటే జగన్‌కు చీమకుట్టినట్లయినా లేదా? అని నిందించారు.నీటిపారుదల రంగాలన్నీ