Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

హర్యానా సీఎం నివాసం వద్ద రైతుల ఆందోళన

ధాన్యం సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు శనివారం హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖత్తార్‌ నివాసం వద్ద నిరసన తెలిపారు. పోలీసు బారికేడ్లపై నిల్చుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వీరిపై పోలీసులు వాటర్‌ కెనన్లను ప్రయోగించి, చెదరగొట్టారు. వివిధ మార్కెట్లు, ఎమ్మెల్యేల నివాసాల వద్ద కూడా రైతులు నిరసనలు తెలిపారు. పంజాబ్‌, హర్యానాలో ధాన్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 11 వరకూ ఇరు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ చేపట్టాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img