Friday, September 22, 2023
Friday, September 22, 2023

హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణస్వీకారం

ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణస్వీకారం చేశరు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏవీ రవీంద్రబాబు, డాక్టర్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్‌, బండారు శ్యాం సుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలతో గవర్నర్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు.వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్‌ తన అధికారాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తారు. దీంతో కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రమాణం చేయించడం ఆనవాయితీ. సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో ఆయన వచ్చే పరిస్థితి లేదు. దీంతో గవర్నర్‌ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img