Monday, November 28, 2022
Monday, November 28, 2022

హైకోర్టు సీజే మిశ్రా ప్రమాణం

గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, మంత్రులు, న్యాయమూర్తుల హాజరు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జస్టిస్‌ మిశ్రాతో ప్రమాణ స్వీకా రం చేయించారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ బాల సుబ్రమణ్యరెడ్డి, హైకోర్టు న్యాయ మూర్తులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొ న్నారు. నూతన సీజే మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ గఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయిం చుకొని రాయ్‌గఢ్‌ జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు, బిలాస్‌ పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా, 2007 సెప్టెంబరు ఒకటి వరకూ అడ్వొకేట్‌ జనరల్‌గా కొనసాగారు. 2009 డిసెంబరు 10న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న మిశ్రాను ఏపీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img