Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అందరికీ హెల్త్‌ ప్రొఫైల్‌

ఏ ఆసుపత్రికి వెళ్లినా తాజా వివరాలు అప్‌లోడ్‌
ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ విధానంపైనా దృష్టి
ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ
విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనూ రక్తం, నీరు,గాలిపై తరచూ పరీక్షలు
సీహెచ్‌సీల్లోనూ డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటు
వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి :
ఒక వ్యక్తి వైద్యం కోసం ఏ ఆసు పత్రికి వెళ్లినా ఆయనకు సంబంధించిన ఆరోగ్య వివరాలు డాక్టర్‌కు వెంటనే అందుబాటులోకి వచ్చేలా ఒక హెల్త్‌ ప్రొఫైల్‌ విధానం రూపొందించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్‌మో హన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ, వాక్సినేషన్‌, వైద్య, ఆరోగ్య శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ డేటా సిద్ధం చేసి ఉంచడం వల్ల వారు ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లినా, విలేజ్‌ క్లినిక్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రి వరకూ ఎక్కడకెళ్లినా వారి ఆరోగ్య వివరాలను తెలుసుకోవడంతోపాటు తాజా డేటాను కూడా అప్‌లోడ్‌ చేసే వీలుంటుంద న్నారు. అలాగే ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, చక్కటి విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలని, రక్తం, నీరు, గాలి ఈ మూడిరటిపైన తరచూ పరీక్షలు జరగాలని సీఎం వారికి మార్గనిర్దేశనం చేశారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలో కూడా ఈ పరీక్షలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శిశు మరణాల తగ్గింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అవసరమైన చోట సీహెచ్‌సీల్లో కూడా డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, పారామెడికల్‌ సిబ్బందికీ మెడికల్‌ కాలేజీల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా పబ్లిక్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కోర్సులు పెట్టాలని స్పష్టం చేశారు. థర్డ్‌ వేవ్‌ సమాచారం నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణకు కొత్త మందులు, మెరుగైన ఫలితాలు, తక్కువ దుష్ప్రభావాలు ఉన్నవాటి వినియోగం వంటి నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం 14,452 ఉండగా, రికవరీ రేటు 98.60 శాతం ఉందని, 10,494 సచివాలయాల్లో యాక్టివ్‌ కేసులు నమోదు శాతం జీరోగా ఉందని, ఇప్పటివరకు 18 సార్లు ఫీవర్‌ సర్వే నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. ఇక థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపై ప్రణాళిక సిద్ధం చేశామని, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌లు 20,964 అందుబాటులో ఉండగా, ఇంకా రావాల్సినవి 2,493 ఉన్నాయని, ఇవిగాక ఆక్సిజన్‌ డి-టైప్‌ సిలిండర్లు 27,311 ఉన్నాయని వివరించారు. 50 అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, మొత్తం 140 ఆస్పత్రులలో పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడిరచారు. ఇప్పటి వరకు సింగిల్‌ డోసు వాక్సినేషన్‌ 1,31,62,815 మంది, రెండు డోసులు 91,72,156 మందికి పూర్తయినట్లు తెలిపారు. అలాగే ఇటీవల కేరళలో పర్యటించిన అధికారులు, వైద్యాధికారుల బృందం కోవిడ్‌తో పాటు ఇతర క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్‌ చంద్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.వి.ఎన్‌.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img