Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

ప్రభుత్వానికి చంద్రబాబు డిమాండ్..
జగన్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమనీ, అందుకే వరి వేసిన రైతు మెడకు ఉరేసుకునే పరిస్థితి వచ్చిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానిది నిర్లక్ష్య వైఖరంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా సమయంలో దేశానికి అన్నం పెట్టిన ఘనత రైతులకే దక్కుతుందని.. అలాంటి రైతులు అకాల వర్షాలతో నష్టపోతుంటే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఉంగుటూరు మండలం నాచుగుంటలో దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు చంద్రబాబు. రైతులతో మాట్లాడి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో రైతులు నిండా మునిగిపోతోంటేౌ గతంలో తాను శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ను తిరిగి శంకుస్థాపన చేసేందుకు సీఎం జగన్ వెళ్లారని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రినీ, వ్యవసాయ శాఖ మంత్రినీ ఎమ్మెల్యేలనూ ప్రజలు తరిమి కొట్టకముందే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. చివరి బస్తా కొనేవరకూ రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా మేముంటామన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతన్నకి న్యాయం చేయిస్తామన్నారు చంద్రబాబు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img