Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అగ్ని పరీక్ష

6.34 లక్షల మంది ఆశలు ఆవిరి

. సైన్యంలో చేరి దేశసేవ చేయాలనుకున్న అభ్యర్థులు
. వెలువడని ఐఏఎఫ్‌ ఎయిర్‌మెన్‌, ఎక్స్‌, వై పరీక్షా ఫలితాలు
. నిలిచిన ఎంపిక ప్రక్రియ బ అడ్డంకిగా మారిన అగ్నిపథ్‌ పథకం
. ఫీజు రీఫండ్‌పై స్పందించని అధికారులు

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని భావించిన 6.34 లక్షల మంది యువకుల ఆశలు ఆవిరయ్యాయి. ఎంతో ఉత్సాహంగా ఐఏఎఫ్‌ ఎయిర్‌మెన్‌, ఎక్స్‌, వై పరీక్షకు సిద్ధమయ్యారు. ఫీజు చెల్లించి పరీక్షకు హాజరై ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ నెలలు గడిచినా సమాచారం లేక తల్లడిల్లిపోయారు. ఇంతలో అగ్నిపథ్‌ రూపేణ అడ్డంకి ఎదురైంది. తాము రాసిన పరీక్ష ప్రకారం ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. కట్టిన ఫీజు రీఫండ్‌ కాలేదు. ఇదే క్రమంలో ఆవేదనకు గురైన లా విద్యార్థి ఒకరు ఆర్టీఐ ద్వారా సంబంధిత సమాచారాన్ని ఐఏఎఫ్‌ నుంచి కోరారు.

న్యూదిల్లీ: ఐఏఎఫ్‌లో చేర్పింపుల కోసం 2021, జూలైలో ఎయిర్‌మెన్‌ ఎక్స్‌వై గ్రూప్‌ పరీక్షలు జరిగాయిగానీ ఫలితాలు విడుదల చేయలేదు. నెలలు గడిచినా ఫలితాలపై ఎలాంటి సమాచారం రాలేదు. సంబంధిత వెబ్‌సైట్‌ కూడా పనిచేయలేదు. అభ్యర్థులకు ఫీజు వాపసు చేయలేదు... ఎందుకంటూ ఆర్టీఐ ద్వారా ఎయిర్‌ఫోర్స్‌ అధికారులను ఉత్తరప్రదేశ్‌, బులంద్‌షహర్‌కు చెందిన మహమ్మద్‌ కామిల్‌ ప్రశ్నించారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో లా చదవుతున్న కామిల్‌ అడిగిన ప్రశ్నలకు ఐఏఎఫ్‌ నుంచి సమాధానాలు వచ్చాయిగానీ రీఫండ్‌ గురించిగానీ తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు.. ఫలితాలు ఎందుకు వెల్లడిరచలేదన్న దానిపై స్పష్టత రాలేదు. కామిల్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ పరీక్షలకు 6,34,249 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎయిర్‌మెన్‌ ఎక్స్‌, వై ట్రేడ్‌ పరీక్ష ఏటా రెండుసార్లు జరగాల్సి ఉండగా 2020, 2021 సంవత్సరాలలో ఒక్కోసారి మాత్రమే నిర్వహించారు. అగ్నిపథ్‌ పథకం కారణంగా ఈ ఎంపిక ప్రక్రియను కేంద్రం ఆపివేసింది. 2021, జనవరిలో ఎయిర్‌మెన్‌ పోస్టులను ప్రకటించినప్పుడు, 12వ తరగతి పూర్తి చేసిన తాను వెంటనే ఈ పరీక్ష రాయాలని ఉత్సాహపడినట్లు కామిల్‌ తెలిపారు. దాదాపు ఏడు నెలలు కష్టపడ్డానని చెప్పారు. అందుకోసం తన న్యాయ విద్యను కాస్త నిర్లక్ష్యం చేయాల్సి వచ్చిందన్నారు. ఎయిర్‌మెన్‌ ఎక్స్‌, వై పరీక్ష గతేడాది జులై 12వ తేదీ నుంచి 18కి వాయిదా వేశారు. నోటిఫికేషన్‌ ప్రకారం, పరీక్ష నిర్వహించిన నెలలోపు ఫలితాన్ని ప్రకటించాలిగానీ ఆ సమయం ముగిసేలోపు మరొక నోటిఫికేషన్‌ వెలువడిరది. అందులో అడ్మినిస్ట్రేటివ్‌ (పరిపాలన) కారణాల వల్ల ఫలితాలు ఆలశ్యమవుతామని ఉందని కామిల్‌ తెలిపారు. ఈ పరిస్థితుల్లో మరో ఎనిమిది నుంచి పది నెలల వరకు పరీక్షా ఫలితాల కోసం అభ్యర్థులంతా ఎదురుచూశారు. చివరకు, ఎయిర్‌మెన్‌ ఎక్స్‌, వై గ్రూపు అభ్యర్థుల ఎంపిక కోసం అగ్నివీర్‌ విధానాన్ని అమలులోకి తెచ్చారన్నారు. ఈ పథకం ప్రకటించినప్పటికీ, అగ్నిపథ్‌ పథకం ద్వారా ఖాళీలను భర్తీ చేస్తారని తెలిసినా అభ్యర్థుల మనస్సుల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయని కామిల్‌ తెలిపారు. పనిచేయని వెబ్‌సైట్‌: 2021 జులైలో జరిగిన పరీక్షల ఫలితాలను ఎందుకు ప్రకటించలేదో అభ్యర్థులకు తెలియదు. సంబంధిత వెబ్‌సైట్‌ పనిచేయక వారు గందరగోళానికి గురయ్యారు. ఫలితాల గురించి సమాచారాన్ని అభ్యర్థులకు చేర్చడానికి ఈ వెబ్‌సైట్‌ను వినియోగిస్తే సబబుగా ఉండేదని కామిల్‌ అన్నారు. ఎయిర్‌ఫోర్స్‌ ఎక్స్‌, వై గ్రూపు పరీక్షలకు సంబంధించి 01/2021 ఖాళీల గురించీ మాకు చెప్పలేదు. వెబ్‌సైట్‌ తొలగింపుఫలితాలను ఎందుకు వెలువరించలేదో కూడా సమాచారం ఇవ్వలేదు. ఫీజులైనా వాపసు ఇచ్చారా అంటే అదీ లేదు. ఈ పరీక్షల కోసం విద్యార్థుల నుంచి ప్రభుత్వం వసూలు చేసిన రూ.15,85,62,250 ఏమయ్యాయి? అని కామిల్‌ ప్రశ్నించారు. తన ప్రశ్నలకు సమాధానాల కోసం ఐదు పాయింట్ల కింద సమాచారాన్ని కోరుతూ ఆగస్టు 30న ఎయిర్‌ఫోర్స్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశారు.
మహమ్మద్‌ కామీల్‌ ప్రశ్నలకు సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ స్పందించారు. ఆ సమాధానాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ పర్సనల్‌ సర్వీసెస్‌, ఎయిర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ (వాయు భవన్‌), న్యూదిల్లీ ద్వారా అక్టోబర్‌ 6న కామిల్‌కు చేర్చారు. వైమానిక దళ ఎక్స్‌, వై గ్రూపు పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఎంతన్న మొదటి ప్రశ్నకు డైరెక్టరేట్‌ ఇలా బదులిచ్చింది. ‘స్టార్‌ 01/2021 నోటిఫికేషన్‌కు స్పందించి మొత్తం 6,34,249 మంది దరఖాస్తు చేసుకున్నారు’ అని పేర్కొంది. ఈ అభ్యర్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు/నిధి గురించి అడిగిన ప్రశ్నకు ‘స్టార్‌ 01/2021 ప్రకటన/నోటిఫికేషన్‌లోని పారా 5 ప్రకారం, అభ్యర్థులు పరీక్ష రుసుమును రిజిస్ట్రేషన్‌ సమయంలో రూ.250 చొప్పున యాక్సిస్‌ బ్యాంకులో గేట్‌వే లేదా చలాన్‌ రూపేణ చెల్లించాలి. అంటే దీని ప్రకారం 6,34,249 మంది లెక్కన మొత్తం రూ.15.85 కోట్లు’ అని తెలిపింది. పరీక్షల ఫలితాల గురించి సమాచారంపై మూడవ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో అగ్నిపథ్‌ పథకం దృష్ట్యా ఈ ప్రక్రియ నిలిచినట్లు అంగీకరించింది. 01/2021 ఇన్‌టేక్‌ కోసం నమోదు ప్రక్రియ, తదుపరి కార్యకలాపాలు నిలిపివేశారు. ఐఏఎఫ్‌లో భర్తీ కోసం ఎంపిక ప్రక్రియ అగ్నివీర్వాయుగా అభ్యర్థుల నమోదు కోసం ‘అగ్నిపథ్‌’ ద్వారా జరుగుతోంది’ అని పేర్కొంది. ఎయిర్‌ఫోర్స్‌ ఎక్స్‌, వై గ్రూపు దరఖాస్తుల గురించి సంబంధిత వెబ్‌సైట్‌లో రికార్డుపై మరొక ప్రశ్నకు స్పందిస్తూ ‘స్టార్‌ 01/2021 ఆన్‌లైన్‌ నమదు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎయిర్‌మెన్‌ సెలక్షన్‌.సీడీఏసీ.ఇన్‌ ద్వారా జరగాలని నోటిఫికేషన్‌లోని పారా 1 చెబుతుంది’ అని బదులిచ్చింది. 2021, జులై 12`18 తేదీల్లో నిర్వహించిన గ్రూపు పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం ప్రతులు ఇవ్వాలన్న కామిల్‌ చివరి అభ్యర్థనను డైరెక్టరేట్‌ తిరస్కరించింది. కోరిన సమాచారం ‘అస్పష్టం’గా ఉంది… ‘నిర్దిష్టమైనది లేదు’ అని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img