Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అడవిలోనే ప్రసవం

. ఏజెన్సీ మహిళల అవస్థలు
. పట్టించుకోని పాలకులు

విశాలాంధ్ర-చింతపల్లి: ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంత ప్రజల బాధలు వర్ణనాతీతం. విద్య, వైద్య సదుపాయాలు లేవు. రవాణా అంతకన్నా లేదు. కష్టకాలంలో డోలీలే వారికి రక్ష. తాజాగా అల్లూరి జిల్లాలో ప్రసవానికి వెళుతున్న ఓ గర్భిణీ మార్గమధ్యలోనే బిడ్డకు జన్మ నిచ్చింది. అ సంఘటన అల్లూరి జిల్లా చింతపల్లి మండలం ఓ మారుమూల పంచాయతీలో శని వారం చోటుచేసుకుంది. పాలమామిడి గ్రామానికి చెందిన సీదరి దేవి(20) ప్రసవ వేదనతో బాధపడు తోంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆమెను అటవీ ప్రాంతం మీదుగా ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటనతో దేవి సహాయకులు నిశ్చేష్టులయ్యారు.
గిరిజనులపై ఇదేనా ప్రేమ:
జగన్‌ పాలనలో రహదారులు, రవాణా సౌకర్యాలు లేక గర్భిణీలు అడవులలో ప్రసవించే పరిస్థితి దాపురించిందని సర్పంచ్‌ పేట్ల రాజబాబు ఆరోపించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు గర్భిణీలు, బాలింతలకు ఉపయోగకరమని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఇటువంటి హృదయవిదారక ఘటనలు పట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ఏజెన్సీ ప్రజలకు కనీస రవాణా సదుపాయం ఏర్పాటు చేయలేదని పాలకులు ఎందుకని నిలదీశారు. రహదారుల కల్పనలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని, అందువలనే ఇటువంటి ప్రసవాలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కళ్లు తెరిచి మారుమూల గిరి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి రవాణా సదుపాయాలు మెరుగుపరచాలని, అందుకు ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img