Friday, April 19, 2024
Friday, April 19, 2024

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలే

20 ఏళ్లుగా ఫీజులనిర్ధారణ లేదు
ఏపీలో విద్యాసంస్థల ఇష్టారాజ్యం
పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు

వఅమరావతి : రాష్ట్రంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల ఫీజుల నియంత్ర ణపై 20 ఏళ్లుగా ఎవరూ చర్యలు తీసుకోలేకపోయారని, ఫీజులను నిర్ధారించలేదని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు చెప్పారు. విజయవాడ రోడ్లు భవనాల శాఖ కార్యాల యంలో గురువారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇతర రాష్ట్రాలలో ప్రైవేట్‌ సంస్థల ఫీజులను ఆయా రాష్ట్రాలు నోటిఫై చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 20 ఏళ్ల నుంచి ఎవరూ పట్టించుకోలేదన్నారు. పాఠశాలలు, కళాశాలల ఫీజుల వసూళ్లలో ఇతర రాష్ట్రాలకు, ఆంధ్ర ప్రదేశ్‌కి చాలా తేడా కన్పిస్తోందని, ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్‌ తగిన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేట్‌ పాఠశాలలు, జూని యర్‌ కళాశాలల్లో మూడు విద్యా సంవత్సరాల కాలానికి (202122, 202223, 2023`24) ఈ ఫీజులు వర్తిస్తా యని వివరించారు. ఫీజుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై చర్యలు తీసుకుం టామన్నారు. అధిక ఫీజుల వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై టోల్‌ ఫ్రీ నంబరు 9150381111కు పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదు చేయాలన్నారు. విద్య వ్యాపారం కాకూడదని, కనీస సౌక ర్యాలు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలపై కమిషన్‌ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ సిఫార్సులకు అనుగుణంగా ఫీజుల నియంత్రణపై జీఓఎంఎస్‌ నంబరు 53, 54 విడుదలచేశామన్నారు. గతే డాది కమిషన్‌ తరపున ప్రైవేట్‌ విద్యాసంస్థలను సందర్శించి, తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాతే మూడేళ్ల కాలానికి ఫీజులు ప్రకటించామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఫీజులతో 80శాతం ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. కమిషన్‌ నిర్ధారించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే…ఆ అదనపు ఫీజును కమిషన్‌ తిరిగి ఇప్పిస్తుందని చెప్పారు. వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.విజయ శారదారెడ్డి మాట్లాడుతూ అధిక ఫీజుల నియంత్రణకు సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారని చెప్పారు. కమిషన్‌ కార్యదర్శి సాంబశివారెడ్డి మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తే తల్లిదండ్రులు ప్రశ్నించాలని సూచించారు. ఫిర్యాదు అందిన వారం రోజుల్లోగా కమిషన్‌ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img