Friday, April 19, 2024
Friday, April 19, 2024

అనుచరులకే అన్నీ !

లాభదాయక పీఎస్‌యూల ప్రైవేటీకరణ
సర్కార్‌ దూకుడు : తక్కువ విలువకట్టి అమ్మేస్తున్న వైనం
సీఈఎల్‌ సంస్థ నందల్‌ ఫైనాన్స్‌ సొంతం
కొనుగోలు కంపెనీకి బీజేపీతో సంబంధాలు

న్యూదిల్లీ: ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదమిస్తూనే అన్ని ప్రభుత్వరంగ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోంది. లాభదాయక సంస్థలను సైతం నష్టాల్లో ఉన్నట్లు చూపి ఎంతో దూకుడుగా అమ్మేస్తోంది. వాస్తవ విలువ కంటే చాలా తక్కువ విలువ కట్టి ‘సన్నిహితుల’కు కట్టబెట్టేస్తోంది. సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ (సీఈఎల్‌) విషయంలోనూ అదే జరిగింది. ఇది లాభాలు గడిరచే ప్రభుత్వ రంగ సంస్థ. అయితే దీనిని కార్పొరేట్‌పరం చేసేందుకు పెట్టుబడుల ఉపసంహరణకు తెరతీసిన కేంద్రం గతేడాది నవంబరులో కేవలం రూ.210కోట్లకు దిల్లీకి చెందిన నందల్‌ ఫైనాన్స్‌ Ê లీజింగ్‌కు సీఈఎల్‌ను అమ్మేసింది. సీఈఎల్‌ సంస్థ ఇంజినీరింగ్‌, సప్లై వస్తువుల, రక్షణ, రైల్వే, భద్రతా, పునరుత్పాదక ఇంధనం వంటి నాణ్యతా పరిణామాలను చూస్తుంది. ఈ సంస్థను నందల్‌ ఫైనాన్స్‌ సొంతం చేసుకుంది. ఇది జరిగి మూడు నెలలకు సీఈఎల్‌ సంస్థను దాని విలువ కంటే కూడా తక్కువగా అమ్మేశారని, కొనుగోలుదారు సంస్థకు బీజేపీతో సాన్నిహిత్యం ఉందన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి. సీఈఎల్‌ విక్రయాన్ని దిల్లీ హైకోర్టుతో పాటు లోక్‌పాల్‌లో సవాల్‌ చేశారు. దీంతో విక్రయ ప్రక్రియను ప్రభుత్వం ఆపివుంచింది. ఇద్దరు బిడ్డర్లు పరిచయస్తులుగా ఉన్నట్లు దాఖలైన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపింది. 2016లో లాభాలు గడిరచే పీఎస్‌యూగా ఉన్న సీఈఎల్‌ను విక్రయించాలను కున్న సంస్థల్లో మొదటిదని ఆ మేరకు రూపొందిన ఎన్డీయే జాబితా పేర్కొంది. రూ.1,592 కోట్ల ఆర్డర్‌ బుక్‌ ఉండి దిల్లీ బయట 50 ఎకరాల భూమిని, ఇంటెలెక్చు వల్‌కేపిటల్‌ను కలిగివున్న సీఈఎల్‌ రిజర్వు ధరను రూ.194 కోట్లుగా ఎన్డీయే పేర్కొంది. ఇంత తక్కువ ధర పెట్టినప్పటికీ రెండు కంపెనీలు మాత్రమే ముందుకు వచ్చాయి. అవి నందల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లిజింగ్‌ Ñ జేపీఎం ఇండస్ట్రీస్‌. ఇక్కడ మరొక ట్విస్ట్‌ ఏమంటే నందల్‌ ఫైనాన్స్‌, శారదా టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గ్రూపు బోర్డు డైరెక్టర్లలో ఒకరైన యతేంద్ర గుప్తా, జేపీఎం పవర్‌ బోర్డు సభ్యునిగానూ ఉన్నారు. దక్షిణ దిల్లీకి చెందిన నందల్‌ ఫైనాన్స్‌ రూ.210 కోట్లకు బిడ్‌ చేసి సీఈఎల్‌ను సొంతం చేసుకుంది. ఈ సంస్థను నందల్‌ ఫైనాన్స్‌కు విక్రయించేందుకు కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, జితేంద్ర సింగ్‌లతో కూడిన ప్యానల్‌ అంగీకారం తెలిపింది. గడ్కరీ రవాణా మంత్రి, సీతారామన్‌ ఆర్థిక మంత్రి, జితేంద్ర సింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి. ఈ శాఖతో నందల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌కు సంబంధం ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్న. నందల్‌ ఫైనాన్స్‌లో 99.96శాతం వాటాను కలిగివున్న ప్రీమియం ఫర్నీచర్‌ అండ్‌ ఇంటరీరస్స్‌కు సీఈఎల్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కాని విషయం. ఈ క్రమంలోనే సీఈఎల్‌ను చాలా తక్కువకు విక్రయించారని ఆ సంస్థ ఉద్యోగుల తరపున వామపక్షాలు, కాంగ్రెస్‌ గళమెత్తాయి. బిడ్డింగ్‌లో పాల్గొన్న రెండు గ్రూపులకూ సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్రం ఆపేసింది. దీనిపై విచారణ చేపడతానమి హామీనిచ్చింది. ఈ పరిణామాల దృష్ట్యా రెండు విషయాలు వెల్లడయ్యాయి. సీఈఎల్‌ను నిజంగానే తక్కువ విలువ కట్టారని, నందల్‌ లిమిటెడ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సీనియర్‌ నేతలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని తేలింది. సీఈఎల్‌ వంటి సీపీఎస్‌యూలకు విలువ కట్టడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వ్యాపారపరమైన చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీని అమ్మడం వల్ల కలిగే లాభనష్టాలను అంచనా వేసుకోవాలి, రక్షణ, సామాజిక వ్యవహాలు లెక్క వేయాలి.
సీఈఎల్‌ ఈక్విటీ బాలెన్స్‌ షీట్‌ విలువ రూ.111 కోట్లు అని కంపెనీకి రూ.210 కోట్లు రావడం మంచి బేరమని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ (డీఐపీఏఎం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే గతంలో తెలిపారు. కానీ సీఈఎల్‌ మాజీ ఉద్యోగులు ఈ వాదనను తోసిపుచ్చారు. 2021, అక్టోబరు 31కి సీఈఎల్‌ పెండిరగ్‌ ఆర్డర్ల విలువ రూ.1,592 కోట్లు కాగా వీటి ద్వారా కేంద్రప్రభుత్వానికి రూ.730కోట్ల స్థూల లాభం వస్తుంది. సొంత స్థలంలోనే ఐదు మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ సీఈఎల్‌కు ఉందని, అది స్క్రాప్‌ కాదని, పనిచేస్తోందని, డబ్బులు వస్తాయని ఓ ఉద్యోగి తెలిపారు. సీఈఎల్‌కున్న ఇంటెలెక్చువల్‌ కేపిటల్‌తో పాటు దిల్లీ వెలుపల సాహిబాబాద్‌లో 50 ఎకరాల భూమి ఉందని, గజియాబాద్‌ సర్కిల్‌ రేటు ప్రకారం ఈ భూమి విలువ రూ.440 కోట్ల వరకు ఉంటుందని, హైవేకు దగ్గరగా ఉండి, ఓవైపు రైల్వే ట్రాక్‌ ఉండటంతో దీని మార్కెట్‌ రేటు రూ.660 కోట్లకుపై మాటేనని చెప్పారు.
2022, జనవరి 17న దిల్లీ హైకోర్టులో డీఐపీఏఎం సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం సీఈఎల్‌ స్థిరాస్తుల విలువ రూ.215.45 కోట్లు కాగా కరెంట్‌, నాన్‌ కరెంట్‌ ఆస్తులు, నగదు, మూలధనం, కనిపించని (ఇన్‌టాంజిబిల్‌) ఆస్తుల విలువ రూ.330.99 కోట్లు అని, రుణం రూ.409.56 కోట్లుగా ఉంది. ఉన్న స్థలం, భవనం, యంత్రాలన్నీ కలిపి రూ.251.45 కోట్ల విలువ ఉంటాయని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటిస్తే.. కేవలం స్థలం విలువ రూ.440 కోట్లు (సర్కిల్‌ రేటు), రూ.660 కోట్లు (మార్కెట్‌ రేటు) అని సీఈఎల్‌ ఉద్యోగులు తెలిపారు. గతంలో స్థలం గురించి పాండే స్పందిస్తూ అది లీజు భూమి అని, 90ఏళ్ల లీజు కాలంలో 46 ఏళ్లు గడిచిపోయాయని చెప్పారు. దిల్లీ హైకోర్టుకు ప్రభుత్వం చెప్పినదానికి ఇది అద్దంపడుతోంది. 2,41,614 చదరపు గజాల స్థలం సీఈఎల్‌కు ఉంటే లీజు కాలంలో 44 ఏళ్లు మిగిలివున్నట్లు కేంద్రం తెలిపింది. అసెట్‌ వాల్యూవర్‌ నివేదిక ప్రకారం సీఈఎల్‌ ప్లాట్‌ విలువ చదరపు మీటరుకు రూ.20వేల నుంచి రూ.23వేల వరకు ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో యూపీఎస్‌ఐడీఏ సూచించిన రేటు చదరపు మీటరుకు రూ.21,803. అంటే 241,614 చదరపు గజాలు (202,020.076 చదరపు మీటర్లు) విలువ రూ.440,46,43,717 లేదా రూ.440 కోట్లు అయింది. ప్రాపర్టీ వెబ్‌సైట్ల ప్రకారం సాహిబాబాద్‌ పారిశ్రామిక వాడలో 10వేల చదరపు అడుగులను అద్దెకు తీసుకోవాలంటే రూ.2,6 లక్షల విలువ ఉంటుంది. 241.614 చదరపు గజాలు అంటే 2174, 526 చదరపు అడుగులను రూ.1.6 లక్షలతో గుణిస్తే నెలకు రూ.5.65 కోట్లు లేదా ఏడాదికి రూ.67.8కోట్లు చొప్పున వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో సీఈఎల్‌ను రూ.210 కోట్లకు కొనుగోలు చేసిన నందల్‌ సంస్థ.. కేవలం భూమిని లీజుకు ఇవ్వడం ద్వారా మూడేళ్లలో పెట్టుబడి మొత్తం తిరిగి పొందగలదు. వాస్తవ విలువ కంటే తక్కువ విలువ కట్టబడిన సంస్థల్లో సీఈఎల్‌ మొదటిది కాదు. దాదర్‌ నాగర్‌ హవేలి విద్యుత్‌ సరఫరా కార్పొరేషన్‌ 2021, మార్చి 31 నాటికి రూ.229 కోట్ల లాభాన్ని గడిస్తే ప్రైవేటీకరణలో భాగంగా దీని రిజర్వు ధరను రూ.151 కోట్లుగా నిర్ణయించారు. గుజరాత్‌కు చెందిన టోరెంట్‌ పవర్‌ సంస్థ రూ.550 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆస్తులను తక్కువ విలువ కట్టి అమ్మేస్తున్న కేంద్రప్రభుత్వ చర్యలను నిశితంగా గమనించాల్సిన అవసరం భారత్‌కు ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img