Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అన్ని సమస్యలకూ మార్క్సిజమే పరిష్కారం

ప్రపంచ మానవాళికి మార్గదర్శకుడు కార్ల్‌మార్క్స్‌: సీపీఐ జాతీయ కార్యదర్శి కాంగో

విశాలాంధ్ర బ్యూరో` తిరుపతి : ప్రపంచ మానవాళి మనుగడకు కార్ల్‌మార్క్స్‌ అసలైన మార్గదర్శకుడని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కాంగో వక్కాణించారు. ప్రపంచ మేధావి కార్ల్‌మార్క్స్‌ 205 వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక బైరాగి పట్టేడలోని సీపీఐ కార్యాలయంలో మార్క్స్‌ చిత్రపటానికి కాంగో తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేముడు కాలనీలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ . రామానాయుడు , ఎం ఆర్‌ పల్లి సీతమ్మ నగర్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, మార్క్స్‌ నగర్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, జీవకొన ప్రాంతాల్లో సీపీఐ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సీపీఐ కళ్యాణ మండపంలో జరిగిన సభలో కాంగో మాట్లాడుతూ సోషలిస్టు, తత్వవేత్త ఆర్థికవేత్త, సామాజికవేత్త , పాత్రికేయుడు అత్యంత బలమైన విప్లవకారుడు, మంచి మానవత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. ప్రపంచ గమనాన్ని మార్చేందుకు ప్రపంచ శ్రామిక దృష్టితో వర్గ సిద్ధాంతాన్ని అందించిన కార్మిక పక్షపాతి కార్ల్‌మార్క్స్‌ అని స్పష్టం చేశారు. కార్ల్‌మార్క్స్‌ జీవితం ఆదర్శనీయమని దోపిడి నుంచి ప్రజలు విముక్తి పొందేందుకు కావలసిన సిద్ధాంతాన్ని అందించిన గొప్ప ఆలోచనపరుడన్నారు. దోపిడీ వ్యవస్థ రూపుమాపి కార్మిక రాజ్యం రావాలంటే కార్మికుల మహత్తర పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. అందుకు తగిన విధంగా 1848 లో ప్రపంచానికి కమ్యూనిస్టు ప్రణాళికను అందించి వర్గ పోరాట బాటను ఏర్పరచిన గొప్ప విప్లవకారుడని కాంగో అన్నారు. దేవుడు కాలనీలో సీపీిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల అభ్యున్నత కొరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేదల సమస్యలపై గట్టిగా పోరాడాలన్నారు. కార్ల్‌ మార్క్స్‌ జీవితం ఎర్ర జెండా పోరాటాల గొప్పతనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జాతీయ నాయకులు ప్రొఫెసర్‌ అనిరాజం వాలే, యుగల్‌ రాయులు, రాజశేఖర్‌, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్‌ó్‌, బి నదియా, ఎన్‌ డి రవి, సాయి, ఆర్‌ బలరాం, జె. నాగరాజు, కె. పద్మనాభరెడ్డి, కేటీి చలం రెడ్డి, సూరి , మునీశ్వర్‌ , అఖిల, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img