Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అప్పుల కుప్ప ఏపీ

రూ.4.42 లక్షల కోట్లకు చేరిక
2019తో పోలిస్తే రెట్టింపైన రాష్ట్రం అప్పు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఏపీ అప్పుల కుప్పగా మారిందని కేంద్రం మంగళవారం పార్లమెంటులో వెల్లడిరచింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదురి రాతపూర్వక సమాధానంలో ఏపీ అప్పుల వివరాలు వెల్లడిరచారు. 2019తో పోలిస్తే ప్రస్తుతం ఏపీ అప్పులు దాదాపు రెండిరతలయ్యాయని ఇందులో పేర్కొన్నారు. అలాగే ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతోందన్నారు. తాజా వివరాల్ని రాజ్యసభలో ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వెల్లడిరచారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పెరుగుతూ పోతున్న అప్పులు ఇప్పుడు పతాకస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా 2019లో వైసీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న రాష్ట్ర అప్పులు రెండిరతలు అయినట్లు కేంద్రం వెల్లడిరచింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తున్న బడ్జెట్‌ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.4,42,442 కోట్లు అని కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదురి తెలిపారు. ఇది బడ్జెట్‌లో పేర్కొన్న అప్పు మాత్రమేనని స్పష్టం చేశారు. 2019లో అప్పు రూ.2,64,451 కోట్లు ఉండగా… 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022లో రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ లెక్కన చూస్తే 2019లో ఉన్న 2.64 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం రూ.4.42 లక్షల కోట్లకు చేరినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో వెల్లడిరచిన బడ్జెట్‌ అప్పులకు తోడు, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఏపీ చేస్తున్న అప్పులు దీనికి అదనమని కేంద్ర మంత్రి తెలిపారు. ఈనెల 4న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గత మూడేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1,34,452 కోట్లు మాత్రమే అప్పు చేశామని ప్రకటన విడుదల చేయగా, మూడు రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా 2019తో పోలిస్తే ఏపీ అప్పు రెట్టింపు అయినందని వెల్లడిరచడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్రం అప్పు పది లక్షల కోట్లకు చేరిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో ముఖ్యంగా బడ్జెట్‌ అప్పుల కంటే బడ్జెటేతర అప్పులు పెరిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img