Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

అప్పు వసూళ్ల కోసం బాలికల వేలం

. రాజస్థాన్‌లో ఘోరం
. జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌
. తక్షణమే చర్యలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ

జైపూర్‌ : రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో రుణాల వసూలు కోసం బాలికలను వేలం వేశారని వచ్చిన వార్తలపై విచారణకు జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యు) ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. భిల్వారాలో రుణ చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు బాలికలను వేలం వేస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చినట్లు కమిషన్‌ తెలిపింది. కొన్ని కేసుల్లో ఆడపిల్లల్ని స్టాంప్‌ పేపర్‌ మీద తనఖాపెట్టి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని, కొన్ని సందర్భాల్లో వివాదాల పరిష్కారం కోసం కుల పంచాయితీల ఆదేశంపై వారి తల్లులు అత్యాచారానికి గురవుతున్నారని పేర్కొంది. ఈ నేరాలు అత్యంత భయంకరం, బాధాకరమని కమిషన్‌ పేర్కొంది. ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఇద్దరు సభ్యుల నిజ-నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తీసుకున్న చర్యలపై కమిషన్‌కు వివరించాలని కూడా కోరారు. కాగా సంబంధిత సెక్షన్ల కింద తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని రాజస్థాన్‌ డీజీపీకి సైతం కమిషన్‌ లేఖ రాసింది. బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్‌ చైర్‌పర్సన్‌ ప్రియాంక్‌ కనూంగో కూడా నవంబర్‌ 7న భిల్వారాను సందర్శించి బాలికల వేలం ఆరోపణలపై విచారణ చేయనున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భిల్వాఢా జిల్లాకు కమిషన్‌ బృందం వెళ్లింది. దీనిపై నవంబర్‌ 1న రాజస్థాన్‌ చీఫ్‌ సెక్రటరీ, భిల్వాఢా ఎస్పీతో సమావేశం కానున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా ఈ తరహా ఘటనల గురించి వార్తలు వస్తున్నా… ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అనేక వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో స్టాంప్‌ పేపర్లు రాయించుకొని బాలికలను వేలం వేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సెక్రటరీకి లేఖ రాశాం’ అని వెల్లడిరచారు. మరోపక్క ఆ రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా దీనిపై స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఇదిలా ఉంటే ఈ వార్తలను రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ ఖచారియావాస్‌ ఖండిరచారు. ‘ఇలాంటి ఘటనల్లో విచారణ పూర్తయ్యేవరకు వాస్తవాలు తెలుసుకోలేం. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ మొదట రాజస్థాన్‌ పోలీసులతో మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో బాలికల అమ్మకాలు జరగడం లేదు’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img