Friday, April 19, 2024
Friday, April 19, 2024

అభద్రతాభావంలో మోదీ ప్రభుత్వం

డి.రాజా
జుబేర్‌ విడుదలకు వామపక్షాల డిమాండు

న్యూదిల్లీ : ఆల్ట్‌ న్యూస్‌ సహ ` వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌ను తక్షణమే విడుదల చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండు చేశారు. దేశ శాస్త్రీయ స్వభావాన్ని పరిరక్షించేం దుకు పనిచేస్తున్న మహమ్మద్‌ జుబేర్‌ వంటి యువ జర్నలిస్టులను కటకటాల పాల్జేయడం ఆక్షేపణీయ మని ట్వీట్‌ చేశారు. జుబేర్‌ అరెస్టుతో మోదీ ప్రభుత్వంలో అభద్రతాభా భావం స్పష్టమైందన్నారు. ‘మతతత్వ విద్వేషాన్ని రెచ్చగొట్టే వారికి పాలకుల అండదండలు ఉన్నాయి. దేశానికి అప్రతిష్ఠ తెచ్చిపెట్టే గూండాలకు రక్షణ లభిస్తోంది’ అని పేర్కొన్నారు. విద్వేషాన్ని రెచ్చగొట్టే వారిని స్వేచ్ఛగా వదిలేస్తూ వారి గురించి వాస్తవాలను బహిర్గతం చేసే వాళ్లను జైళ్లకు పంపడం ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వ తీరును సీపీఐతో సహా వామ పక్షాలు ప్రశ్నించాయి. జుబేర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఐక్యంగా డిమాండు చేశాయి. ‘నుపుర్‌ శర్మ స్వేచ్ఛగా తిరుగుతుంటే ఆమె విద్వేష ప్రసంగాన్ని ప్రపంచ దృష్టికి తెచ్చిన జుబేర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అంటూ సీపీఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య ట్వీట్‌ చేశారు. ‘మోదీ ప్రభుత్వానికి అభద్రతా భావం ఉంది. తప్పుడు సమాచారాన్ని బయట పెట్టేవారిని చూసి బెదిరిపోతోంది’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్‌ ద్వారా విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img