Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అభినందన్‌ వర్ధమాన్‌కు వీర్‌చక్ర పురస్కారం

బాలాకోట్‌ వైమానిక దాడుల్లో పాక్‌ సైన్యంతో వీరోచితంగా పోరాడిన భారత వైమానిక దళం గ్రూప్‌ కెప్టెన్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను కేంద్ర ప్రభుత్వం ‘వీర్‌ చక్ర’ పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. పాక్‌ వైమానిక దళంతో వీరోచితంగా పోరాడి ఆ దేశానికి చెందిన ఎఫ్‌`విమానాన్ని కూల్చివేసినందుకుగానూ అభినందన్‌కు 2019లో కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం జరిగిన గ్యాలెంటరీ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అభినందన్‌ వీర్‌చక్ర అవార్డును అందుకున్నారు. పాకిస్తానీ వాయు చొరబాట్లను నిరోధించినందుకు అతనికి గతంలో శౌర్య చక్ర అవార్డు లభించింది. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు చూపిన, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పలువురు వీర జవాన్లకు రాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img