Friday, April 19, 2024
Friday, April 19, 2024

అమరావతిపై 23న విచారణ

. త్వరితగతిన విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం వినతి
. రెండు వారాల సమయం కోరిన పిటిషనర్లు
. విచారణ తేదీ ఖరారు చేసిన సుప్రీం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాజధాని అమరావతి కేసుపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విశాఖలో ఉగాది నాటికి పరిపాలనా రాజధాని ప్రారంభమవుతుందని పదేపదే మంత్రులు చెపుతుండగా, రాజధాని అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారిం చాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేయడా నికి తమకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈనెల 23న విచారణకు తీసుకుంటామని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం వెల్లడిరచింది. గత ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధానిని కేవలం శాసన రాజధానికి పరిమితం చేసి, విశాఖలో పరిపాలన, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చట్టం చేసింది. దీనిపై అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములిచ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించగా, విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదని, అమరావతిని కొనసాగించాల్సిందే నని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే తెచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంలో స్టే వచ్చిన వెంటనే తన మకాం విశాఖకు మార్చాలని ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆతృత పడుతున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఏపీ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. మార్చి మొదటి వారంలో విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగబో తుందని… ఏపీలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నందున పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. విశాఖ రాజధాని కాబోతోందని, తాను కూడా అక్కడకు మారబోతున్నట్లు ప్రకటిం చారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా…సీఎం ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. కోర్టు తీర్పును ముఖ్యమంత్రే గౌరవించకుండా, విశాఖ రాజధాని అంటూ ఎలా చెబుతారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావా లని రైతులు భావిస్తున్నారు. ఈనెల 23న అమరావతి రాజధాని కేసును సుప్రీంకోర్టు విచారించనున్నట్లు వెల్లడిరచడంతో రాష్ట్ర ప్రజల్లో మళ్లీ ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img