కొలరాడోలో నమోదు
అమెరికాలో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు మనుషుల్లో వెలుగు చూసింది. కొలరాడోకు చెందిన వ్యక్తిలో ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా ఏ(హెచ్5) వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విభాగం ప్రకటన విడుదల చేసింది. హెచ్5 వైరస్ మనుషుల్లో కనిపించడం చాలా అరుదు. ఇటువంటి ఒక కేసు 2021 డిసెంబర్లో బ్రిటన్‌లోనూ వెలుగు చూసింది. అయితే కొలరాడో వ్యక్తికి కొన్ని రోజులుగా అలసటగా ఉండడం తప్పించి మరే ఇతర లక్షణాలు కనిపించలేదని సీడీసీ తెలిపింది. ఆ రోగిని విడిగా ఉంచి ఇన్ ఫ్లూయెంజా యాంటీ వైరల్ ఔషధంతో చికిత్స చేసినట్టు పేర్కొంది. ఇప్పుడు అతను పూర్తిగా కోలుకున్నాడు. బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1 వైరస్) బారిన పడిన పక్షులకు సన్నిహితంగా ఉన్న 2,500 మందిని పరిశీలనలో ఉంచినట్టు సీడీసీ వెల్లడిరచింది.