Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అమెరికాలో మళ్లీ కాల్పులు

టెక్సాస్‌లో 9 మంది, కాలిఫోర్నియాలో ఒకరి మృతి

అల్లెన్‌/చికో: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి మితి మీరిపోయింది. నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసు కుంటున్నాయి. ఉత్తర కాలిఫోర్నియాలో 17ఏళ్ల బాలిక కాల్చివేతకు గురికాగా టెక్సాస్‌లోని మాల్‌లో తొమ్మిది మంది కాల్పుల్లో వరణించారు. ఆగంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు. ఈ రెండు ఘటనల్లో 12 మంది వరకు గాయపడ్డారు. కేవలం 24 గంటల్లో రెండు చోట్ల కాల్పులు జరిగాయి. టెక్సాస్‌లోని మాల్‌లో ఇద్దరు దుండగులు చొరబడిన విచక్షణా రహితంగా కాల్పులు జరిపి తొమ్మిది మంది ప్రాణాలను హరించారు. మరో ఏడుగురికి గాయపరిచారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసు అక్కడకు చేరుకొన్న వెంటనే మిలిటరీ వస్త్రధారణలో ఉన్న ఓ దుండగుడిని కాల్చి చంపారు. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే ఇంత బీభత్సం జరిగిపోయిందని, మేమంతా భయంతో మాల్‌ నుంచి బయటకు పరుగులు తీశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ఉత్తర కాలిఫోర్నియాలో తెల్లవారుజాము 3.30 గంటలకు కాల్పులు జరిగినట్లు చికో పోలీసు చీఫ్‌ బిల్లీ అల్‌డ్రిజ్‌ తెలిపారు. గాయపడిన ఆరుగురిని ఆసుపత్రులకు తరలించగా వారిలో టీనేజర్‌ (17) అమ్మాయి చనిపోయిందన్నారు. 20ఏళ్ల లోపు మరో నలుగురు అబ్బాయిలు చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిర్మాణుష ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, స్థానికులకు ఎలాంటి ప్రమాదం లేదని, కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని బిల్లీ అల్‌డ్రిజ్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img