Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అమెరికా ప్రతీకారం

ఐసిస్‌`కే స్థావరాలు లక్ష్యంగా దాడి
కాబూల్‌ సూత్రధారి మృతి ?

కాబూల్‌ : అఫ్గాన్‌లో ఘాతుకానికి పాల్పడిన ఐసిస్‌కేపై అమెరికా ప్రతీకార దాడులు జరిపింది. గంటల వ్యవధిలో ఐసిస్‌కే ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేసింది. అఫ్గాన్‌పై డ్రోన్ల వర్షం కురిపించింది. అఫ్గాన్‌లోని నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై ఆపరేషన్‌ చేపట్టింది. అఫ్గాన్‌ నుంచి బలగాలను తరలించేందుకు మంగళ వారం తుది గడువు కాగా, అది ముగియడానికి ముందే కాబూల్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని పెంటగాన్‌ హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా ఈ చర్య తీసుకుంది. ఈ దాడుల్లో పౌరులెవరూ మృతి చెందలేదు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ డ్రోన్‌ దాడులకు ఆమోదం తెలపడంతో ప్రణాళికలు చకచకా సాగుతున్నాయి. డ్రోన్‌ దాడుల్లో కాబూల్‌దాడి సూత్రధారి మరణించినట్లు తెలుస్తోంది. కాబూల్‌ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళుతుండగా గుర్తించి పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది. ఈ దాడిలో సూత్రధారితో పాటు అతని సహాయకుడు మృతి చెందాడు. విమానాశ్రయ ఆత్మాహుతి దాడుల్లో మరణించిన వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఆగస్టు 31లోపు ఉపసంహరణ ప్రయత్నాలను పూర్తి చేయాలని తాము భావిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు. కాబూల్‌

విమానాశ్రయంలో 5400 మంది ప్రజలు ఇంకా తరలింపు కోసం వేచిచూస్తున్నట్లు పేర్కొన్నారు. కాబూల్‌ విమానాశ్రయంలో బాంబు దాడిలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో దాదాపు 12,500 మందిని తమ దేశానికి తరలించినట్టు వైట్‌హౌస్‌ తెలిపింది. ఈ దాడులకు తామే కారణమని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించడంతో…ముష్కరులను వేటాడి మట్టుపెట్టడం తథ్యమని బైడెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఉగ్రదాడిని ఖండిరచిన భద్రతా మండలి
కాబూల్‌ ఉగ్రదాడిని ఐరాసలో కీలకమైన భద్రతామండలి తీవ్రంగా ఖండిర చింది. ఈ దాడులు అత్యంత శోచనీయమైనవిగా పేర్కొంది. అఫ్గాన్‌ భూభాగాన్ని ఇతరదేశాలు దాడులకు, బెదిరింపులకు ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ఈ దాడిలో పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గర్హనీయమని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img