Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అమ్మాయిలు మెరిసెన్‌..

ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు సంచలనం
క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం
41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ సెమీస్‌లోకి ఎంట్రీ

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. అత్యుత్తమ ప్రదర్శనతో అబ్బురపరిచింది. సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రపంచ నంబరు.2 జట్టు అయిన ఆస్ట్రేలియాపై 1-0 గోల్స్‌ తేడాతో గెలుపొంది సెమీఫైనల్స్‌లో అడుగు పెట్టింది. స్వర్ణ పతకానికి రెండు మెట్ల దూరంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో భారత మహిళా హకీ జట్టు 41 ఏళ్ల తర్వాత సెమీ ఫైనల్‌కు చేరడం విశేషం. చివరిగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారతజట్టు నాలుగో స్థానంలో నిలి చింది. ఇన్నేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయడం విశేషం. గ్రూప్‌దశలో వరుసగా 3 మ్యాచ్‌లు ఓడి పోయినా కుంగిపోని భారత మహిళా హాకీ జట్టు.. చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 22వ నిమిషం వద్ద భారత క్రీడాకారిణి గుర్జిత్‌ కౌర్‌ గోల్‌ కొట్టి భారత్‌కు ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన రాణి రాంపాల్‌సేన.. ప్రత్యర్థిని ఖాతా తెరవనీయ కుండా అడ్డుకోగలిగింది.
గోల్‌కీపర్‌ సత్తా..
భారత మహిళల జట్టుకు చెందిన గోల్‌ కీపర్‌ సవితా పునియా.. ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నాలను 9 సార్లు నిలువరించింది. ఈ విజయంలో ఎక్కువ శాతం ఘనత ఆమెకే చెందుతుంది. ఇక గుర్జీత్‌ కౌర్‌ ఈ మ్యాచ్‌లో భారత్‌కు తొలి, ఏకైక గోల్‌ను అందించి ప్రత్యే కంగా నిలిచింది. కాగా బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా, హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా చేయకుండానే నిష్క్రమించడం గమనార్హం. ఇక క్వార్టర్స్‌కు ముందు పూల్‌ ‘ఎ’లో భారత్‌ లీగ్‌ దశలో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడిరటిలో ఓడిరది. ఏడు గోల్స్‌ చేసి, 14 గోల్స్‌ సమర్పించుకుంది. సోమవారం నాటి మ్యాచ్‌లో మాత్రం ఏకైక గోల్‌తోనే విజయం సాధించి సెమీస్‌లో

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img