Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అల్‌-జవహరీని హతమార్చాం : అమెరికా అధ్యక్షుడు బైడన్‌ అధికారిక ప్రకటన

అల్‌ఖైదా చీఫ్‌ అల్‌-జవహరీ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో డ్రోన్‌ దాడులు జరిపి అల్‌ జవహరిని హతమార్చినట్లు జో బైడెన్‌ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి అల్‌ జవహరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్నా పట్టుకుంటామన్నారు. ఎంత కాలమైనా.. ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతామని బైడెన్‌ వ్యాఖ్యానించారు.ప్రపంచంలో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో జవహరీ ఒకరు. లాడెన్‌ హతం తర్వాత అల్‌ఖైదా నాయకత్వాన్ని జవహరీ కొనసాగించారు. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల ఘటనలో ఆయన సూత్రధారి. అతడిపై అమెరికా 25 మిలియన్‌ డాలర్ల రివార్డు కూడా గతంలో ప్రకటించింది.అల్‌ జవహరి తన కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించేందుకు జో బైడెన్‌ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినవారు డ్రోన్‌ దాడులు చేసి అల్‌ జవహరిని హతమార్చారు. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్‌ తెలిపారు. అల్‌ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img