Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అవినాశ్‌ పిటిషన్‌పై వీడని ఉత్కంఠ

విచారణ నేటికి వాయిదా
గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కూడా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైఎస్‌ వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడిరది. ఈనెల 25వ తేదీ వరకు అవినాశ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానిపై సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ 11 పేజీలతో సుదీర్ఘ తీర్పునిచ్చింది. అవినాశ్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరుపై, తెలంగాణ హైకోర్టు వైఖరిని సీజేఐ ధర్మాసనం తప్పుబట్టింది. కేసు దర్యాప్తు దశలో ఉండగా హైకోర్టు జోక్యం అవాంఛనీయమని సుప్రీం అభిప్రాయపడిరది. సీబీఐ దర్యాప్తును నీరుగార్చేలా హైకోర్టు ఉత్తర్వులున్నాయని, నిందితుడ్ని విచారించే విషయంలో ఉత్తర్వులు ఇచ్చిన తీరు ఏమాత్రం బాగాలేదని సీజేఐ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నేర చట్టాలను తిరగరాసే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉండటం శోచనీయమని సీజేఐ తీర్పులో పేర్కొంది. సీబీఐ అఫిడవిట్‌లోని అంశాలను తప్పుగా అన్వయించుకుని హైకోర్టు అసాధారణ ఉత్తర్వులు జారీ చేసిందని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. చివరకు ఈ ఒక్కరోజైనా అవినాశ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని అవినాశ్‌ తరపు న్యాయవాది కోరగా, దానికి కూడా నిరాకరిస్తూ దీనిపై తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ నేపధ్యంలో మంగళవారం ఈ పిటిషన్‌ విచారణకు రాగా, వాదనలు బుధవారం వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇక ఇదే కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కూడా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ వాదించింది. కాగా బెయిల్‌ రద్దుకు బలమైన కారణాలేమీ లేవని ఎర్ర గంగిరెడ్డి తరపు న్యాయవాది వాదించారు. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణ కూడా బుధవారానికి వాయిదా పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img