Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆందోళనకరంగా సల్మాన్‌ రష్దీ ఆరోగ్య పరిస్థితి..

ప్రముఖ రచయిత, ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడి షాక్‌కు గురిచేసింది. అమెరికాలోని న్యూయర్క్‌ లో కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన సల్మాన్‌ రష్దీ ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన నెలకొంది.శస్త్రచికిత్స తర్వాత వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్న ఆయనకు ఒక కన్ను పూర్తిగా కంటిచూపు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కత్తితో తీవ్రంగా పొడవడం వల్ల లివర్‌ కూడా దెబ్బతినట్లు వైద్యులు చెబుతున్నారు. ఓ వార్తా సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుతం సల్మాన్‌ రష్దీ ఆరోగ్యం విషమంగానే ఉందని..శాశ్వతంగా ఓ కన్ను కోల్పోవచ్చనే సంకేతాలు వైద్యులు, రష్దీకి చెందిన సన్నిహితుల నుంచి వస్తున్నాయని ఆవార్తా సంస్థ పేర్కొంది.భుజంపై నరాలు తెగిపోయాయని, లివర్‌ పై కత్తిపోట్లు ఉన్నాయని తెలిపారు. కత్తితో దాడిచేసిన వ్యక్తిని న్యూజెర్సీలోని ఫెయిర్‌ వ్యూకు చెందిన 24 ఏళ్ల హదీ మాటర్‌ గా న్యూయర్క్‌ పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ఇంకా ఎవరున్నారనేది పూర్తి విచారణ లో తేలనుంది. న్యూయర్క్‌ లోని ఓ ఇనిస్టిట్యూట్‌ లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా ఓ యువకుడు రష్దీపైకి దూసుకొచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రష్దీ ఒక్కసారిగా స్టేజీపై కూలిపోయారు. తక్షణమే ఆయన్ను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. రష్దీ రచించిన మిడ్‌ నైట్‌ చిల్డ్రన్‌ నవలకు 1981లో బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. దీంతో ఆయన ఎంతో పేర్గాంచారు. ఆయన రచనలు పలు సందర్భాల్లో వివాదస్పదమయ్యాయి. ఈ ఘటనపై శ్వేతసౌధం స్పందించింది. ఇదెంతో షాక్‌ కు గురిచేసిందని.. తాము ఈ దాడిని ఖండిస్తున్నామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img