Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆగని రైతుపోరు

లాఠీలు ఎత్తితే ఊరుకుంటామా?
అన్నదాత కన్నెర్ర ` కర్నాల్‌ సెక్రటేరియట్‌ ముట్టడి

ఆ అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందే
రైతు సంఘాల నేతల డిమాండు

కర్నాల్‌ (హరియాణా) : హరియాణాలోని కర్నాల్‌లో రైతుల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. తమపై లాఠీచార్జి చేసిన అధికారులపై చర్యలు తీసుకునే వరకూ ఆందోళన విరమించేది లేదని రైతుల సంఘాల నేతలు స్పష్టంచేశారు. ఆందోళన కొనసాగింపులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట రాత్రి నుంచి గుడారాలు వేసేకొని రైతులు నిరసన తెలుపుతున్నారు. ‘మా హక్కుల కోసం పోరాడుతుంటే లాఠీలతో కొడతారా…? పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవాలా..? సంబంధిత అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోరు? మా తలలు పగలగొట్టమన్నోళ్లను బర్తరఫ్‌ చేయాల్సిందే..లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం.. న్యాయం జరిగితే తప్ప వెనక్కు తగ్గం’ అని కర్నాల్‌ జిల్లా యంత్రాంగానికి రైతులు స్పష్టంచేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు కదిలేది లేదని కర్నాల్‌ సెక్రటేరియట్‌ వద్ద బైఠాయించిన రైతులు తేల్చిచెప్పారు. ఆగస్టు 28న నిరసనకారులపై పోలీసులు లాఠీలు రaళిపించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ వేలాదిమంది అన్నదాతలు కర్నాల్‌ జిల్లా కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిరచారు. గేట్ల ఎదుట బైఠాయించారు. మంగళవారం సాయంత్రం నుంచి అంగుళం కూడా కదలని వీరు మినీసెక్రటేరియట్‌ బయట రాత్రంతా గడిపారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే తప్ప కదలబోమని కరాఖండీగా చెప్పారు. స్థానిక యంత్రాంగంతో చర్చలు విఫలం కావడంతో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ‘ఆందోళనకారులు మితిమీరితే వారి తలలు పగలగొట్టండి’ అంటూ పోలీసులకు ఓ అధికారి ఆదేశాలిస్తున్న టేపు బయటకు రావడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ అధికారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని రైతునేతలు ముక్తకంఠంతో డిమాండు చేశారు. బీజేపీ సభాస్థలి వరకు మార్చ్‌ నిర్వహించే ప్రయత్నంతో పోలీసులతో ఘర్షణ జరిగి పదిమంది రైతులు గాయపడ్డారు. ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు రైతు నేతలు చెప్పగా జిల్లా యంత్రాంగం తోసిపుచ్చింది. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) అధ్వర్యంలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం ఉదయం నిరసనకారులంతా టీ, టిఫిన్‌ తయారు చేసుకుంటూ సెక్రటేరియట్‌ వద్ద కనిపించారు. హరియాణా బీకేయే (చౌదుని) చీఫ్‌ గుర్నామ్‌ సింగ్‌ చౌదుని విలేకరులతో మాట్లాడారు. ‘అధికారిని బదిలీ చేయడం ఆయనను శిక్షించినట్లు కాదు. రోడ్లు దిగ్బంధించినందుకు రైతులపై కేసులు పెట్టినప్పుడు సంబంధిత అధికారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రైతుల తలలు పగలగొట్టమని ఆదేశాలిచ్చేందుకు అనుమతిచ్చే చట్టం ఏమైనా ఉందా? అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img