Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆగస్టు నుంచి పిల్లలకు కొవిడ్‌ టీకాలు

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. అయితే ఆగస్టు నుంచి చిన్నారులకు కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ వెల్లడిరచారు.బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తమ పార్టీ ఎంపీలకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఇండియాలో రెండు కోవిడ్‌ టీకాలను పిల్లలపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. జైడస్‌ క్యాడిలా ఇచ్చిన రిపోర్ట్‌ను డ్రగ్‌ రెగ్యులేటర్‌ పరిశీలిస్తోంది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలపై జైడస్‌ కోవిడ్‌ టీకా ట్రయల్స్‌ నిర్వహించింది. 2 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలపై భారత్‌ బయోటెక్‌ రెండవ, మూడవ దశ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img