Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..

ఆధార్‌ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ అప్‌డేట్‌ చేసుకొవాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. కనీసం ఒక్కసారైనా వివరాలను అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి తెలిపింది. దేశవ్యాప్తంగా మీ సేవా, బ్యాంకింగ్‌, పోస్టల్‌ సేవల ద్వారా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపింది.ఈమేరకు ఆధార్‌ నిబంధనలను కేంద్రం సవరిస్తూ ఐటీ ఎలక్ట్రానిక్స్‌ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇది కచ్చితంగా సమాచారంను నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది.మై ఆధార్‌ పోర్టల్‌ లేదా దగ్గరలోని ఆధార్‌ కేంద్రం నుంచి ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపింది. ఈ ఆప్డేట్‌ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని ఈ గేజిట్‌లో పేర్కొన్నారు.గత యేడాది 16కోట్ల మంది ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 134 కోట్ల మంది ఆధార్‌ కార్డులను కలిగి ఉన్నారని ఈ గేజిట్‌లో పేర్కొన్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ ఆధార్‌ను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలన్రి తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img