Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆధునిక సోషలిస్టు చైనా నిర్మాణం

జిన్‌పింగ్‌ పిలుపు

బీజింగ్‌ : నూతన శకం నవీన ప్రయాణంలో కొత్త, మహత్తర అద్భుతాలను సైతం సృష్టించగలదన్న సంపూర్ణ విశ్వాసం, సామర్థ్యంతో చైనా కమ్యూనిస్టు పార్టీ ఉందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏకీకృత ఆలోచన, పటిష్ఠ విశ్వాసం, నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్న లక్ష్యాలను మహాసభ గ్రహించినట్టు చెప్పారు. బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో వారం రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 2,338 మంది ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నట్టు ఆయన తెలిపారు. ‘మన పతాకం సమున్నతిని చేసే, మన బలాన్ని కూడదీసే, సంఫీుభావం, అంకితభావం పెంపొందించే మహాసభలు ఇవి’ అని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో 205 మంది సభ్యులు, 171 మంది ప్రత్యామ్నాయ సభ్యులతో సీపీసీ కేంద్ర కమిటీని, 133 మంది సభ్యులతో కూడిన కేంద్ర క్రమశిక్షణ సోదా కమిషన్‌ను (సీసీడీఐ) మహాసభ ఎన్నుకుంది. 19వ సీపీసీ కేంద్ర కమిటీపై ఒక తీర్మానాన్ని, 19వ సీసీడీఐ పని నివేదికపై తీర్మానాన్ని, సీపీసీ నిబంధనావళి సవరణపై మరో తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. ‘‘మహాసభలో తీసుకున్న అన్ని నిర్ణయాలు, రూపొందించిన ప్రణాళికలు, వాటి ఫలితాలు అన్ని అంశాలలో ఆధునిక సోషలిస్టు దేశం నిర్మాణానికి, అన్ని రంగాలలో జాతీయ పునరుజ్జీవనానికి, చైనా లక్షణాలతో సోషలిజం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img