Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఆఫ్‌లైన్‌ పరీక్షల రద్దు కోరుతూ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

సీబీఎస్‌ఈతో సహా ఇతర బోర్డులు ఈ ఏడాది నిర్వహించే 10, 12వ తరగతి ఆఫ్‌లైన్‌ పరీక్షల (2022) రద్దు కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.ఇలాంటి పిటిషన్లన్నీ తప్పుదారి పట్టిస్తాయని, విద్యారులకు తప్పుడు విశ్వాసాలు కలుగుతాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిపై అధికారులను ఒక నిర్ణయం తీసుకోనీయండని, ఆ తర్వాతే ఉత్తర్వులను సవాలు చేసే వీలుంటుందని న్యాయమూర్తి ఎ.ఎం.ఖాన్విల్కర్‌ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోనందుకు మరికొద్ది రోజుల్లో నిర్వహించే 10,12వ తరగతి బోర్డు ఆఫ్‌లైన్‌ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 15 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ వ్యాజ్యాన్ని వేశారు. అందుకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఫలితాలు ప్రకటించేలా సీబీఎస్‌ఈ, ఇతర బోర్డులకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఏ.ఎం.ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img