Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో NIA సోదాలు

  • నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఈరోజు సుమారు వంద ప్రాంతాల్లో సోదాలు చేప‌ట్టింది. నిషేధిత వేర్పాటువాద గ్రూపు సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్‌(ఎస్ఎఫ్‌జే) స‌భ్యుడు జ‌స్వింద‌ర్ సింగ్ ముల్తానీకి లింకు ఉన్న ప్ర‌దేశాల్లో ఎన్ఐఏ త‌నిఖీలు చేస్తోంది. దాదాపు ఆరు రాష్ట్రాల్లో సోదాలు జ‌రుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పంజాబ్‌, రాజ‌స్తాన్‌, యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఈ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. చండీఘ‌డ్‌లో గ‌త ఏడాది మోడ‌ల్ బురెయిల్ జైలు వ‌ద్ద బాంబు పెట్టిన కేసులో జ‌స్వింద‌ర్ సింగ్ ముల్తానీ అనుమానితుడు. లుథియానా కోర్టు పేలుడు ఘ‌ట‌న‌లో మాస్ట‌ర్‌మైండ్ అయిన అత‌న్ని 2021లో జ‌ర్మ‌నీలో అరెస్టు చేశారు. టెర్ర‌ర్‌, నార్కోటిక్స్‌, స్మ‌గ్లింగ్‌, గ్యాంగ్‌స్ట‌ర్ కేసుల్లో భాగంగా ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్‌స్ట‌ర్లు.. ఖ‌లిస్తానీ గ్రూపుల‌కు ఫండింగ్ చేస్తూ ఉగ్ర‌కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎన్ఐఏకు చెందిన సుమారు 200 రెడ్ టీమ్ స‌భ్యులు సోదాల్లో పాల్గొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img