Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆరోగ్య కార్యకర్తలపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపింది

కొవిడ్‌పై పోరాటంలో లక్షా 80 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు మృతి
డబ్ల్యూహెచ్‌వో

కొవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్షా 80 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు మృతిచెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు కొవిడ్‌పై పోరాటంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అథనమ్‌ గెబ్రియాసిస్‌ తెలిపారు. కొవిడ్‌ టీకాల పంపిణీలో జరుగుతున్న అసమానతలను ఆయన తప్పుపట్టారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు తొలుత కొవిడ్‌ టీకాలను ఇవ్వాలని సూచించారు.ఆరోగ్య కార్యకర్తలపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కొవిడ్‌ టీకాల జాప్యం వల్ల కరోనా వచ్చే ఏడాది కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో మరో ధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 మిలియన్ల మంది ఆరోగ్యకార్యకర్తలు ఉన్నారు. అయితే 119 దేశాలకు చెందిన డేటా ప్రకారం.. ప్రతి అయిదుగురిలో ఇద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు టెడ్రోస్‌ తెలిపారు. ఆఫ్రికాలో పది మందిలో, ఒక హెల్త్‌వర్కర్‌ మాత్రమే వ్యాక్సినేట్‌ అవ్వగా, సంపన్న దేశాల్లో పది మందిలో.. 8 మంది టీకాలు వేయించుకున్నట్లు టెడ్రోస్‌ తెలిపారు. ఆఫ్రికాలో కేవలం 5 శాతం జనాభా మాత్రమే కొవిడ్‌ టీకా వేయించుకున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img