Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆర్జేడీ ప్రతాపరెడ్డిపై విచారణకు ఈసీ ఆదేశం

విధుల నుంచి తక్షణమే తొలగించాలి: ఎస్టీయూ నేత తిమ్మన్న డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు బి ప్రతాపరెడ్డి అక్రమాలపై విచారణకు ఎన్నికల కమిషన్‌ ఆదేశించినట్లు రాష్ట్రోపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి హెచ్‌. తిమ్మన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆరు నెలలుగా ఆర్జేడీ ప్రతాపరెడ్డి ప్రభుత్వ అండదండలతో ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు మొదలుకొని ప్రచారం వరకు అనేక అక్రమాలు చేస్తున్నారని, ఈ విషయమై ఈ నెల 2వ తేదీ ఎన్నికల కమిషన్‌కు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫలితంగా ప్రతాపరెడ్డిపై కడప, కర్నూలు జిల్లాలలో విచారణ అధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. తన సమీప బంధువైన ఎం వి రామచంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందువలన ప్రతాప రెడ్డి ఆయనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ అధికార హోదాను అడ్డం పెట్టుకొని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘం నాయకులతో సెలవు దినాలలో అనధికార సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడని తెలిపారు. ప్రతాప రెడ్డి ఎంఈవోలు, హెచ్‌ఎంల ద్వారా ఉపాధ్యాయ సంఘం నాయకులకు, సీనియర్‌ ఉపాధ్యాయులకు మొబైల్‌ ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ, మాట వినని వారిని బెదిరిస్తూ రామచంద్రారెడ్డికి ఓట్లు వేయకపోతే ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఆర్జేడీ అక్రమాలపై విచారణ చేసి తక్షణం కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లు ఈసీకి నిష్పక్షపాతంగా నివేదిక సమర్పించాలని కోరారు. అవసరమైతే ఆర్జ్జెేడి ప్రతాపరెడ్డి అక్రమాల పై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రతాపరెడ్డి సొంత జిల్లా కడప అయినందున ఆయనను తక్షణం ఆర్జేడీగా తొలగించి స్థానికేతరులను నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రతాపరెడ్డి కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌, ఆదోనిలో జ్యోతిర్మయి డిగ్రీ కాలేజీలో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం చేసినట్లుగా అన్ని రకాల ఆధారాలున్నాయని, త్వరలోనే వీటన్నింటిని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళతామని తిమ్మన్న తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img