Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆర్డినెన్సు ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ ప్రమాదకరం

ప్రైవేటీకరణ మోజులోవ్యవస్థ ధ్వంసం
సీపీఐ హెచ్చరిక
బీఎస్‌ఎఫ్‌ విస్తరణపై పునర్‌పరిశీలించాలి
బంగ్లాదేశ్‌లో మతహింస ఆందోళనకరం

న్యూదిల్లీ : దీర్ఘకాలంగా మన రక్షణ దళాలకు అండగా నిలిచిన 41 ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను కొత్తగా ఏడు రక్షణ కంపెనీలుగా మార్పు చేయటంపై సీపీఐ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్రుతగా కార్పొరేట్లకు చెందిన ఏడు రక్షణ కంపెనీలను ప్రారంభించడాన్ని పార్టీ ఖండిరచింది. ప్రధాని నిస్సిగ్గుగా ఈ నెల 15 న కొత్త రక్షణ కంపెనీలను ప్రారంభించారు. సీపీఐతో సహా అన్ని ప్రతిపక్షాలు, ఏఐటీయూసీతో సహా అన్ని ట్రేడ్‌ యూనియన్లు రక్షణ విభాగం సివిల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్లు తెలియజేస్తున్న తీవ్ర నిరసనను సైతం ప్రధాని పట్టించుకోలేదని ఆ ప్రకటనలో రాజా విమర్శించారు. 220 ఏళ్లుగా ఆర్డినెన్సు ఫ్యాక్టరీలు దేశానికి సేవలు అందిస్తున్నా యనీ, ఆర్‌ఎస్‌ఎస్‌` బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ మోజులో ఈ ఫ్యాక్టరీల వ్యవస్థను ధ్వంసం చేస్తున్నా యన్నారు. వివిధ కీలక సమయాల్లో స్థాపించిన ఈ ఫ్యాక్టరీలు రక్షణ విభాగానికి అవసరమైన పరికరాలను అందించటంలో కీలక పాత్ర వహించాయని గుర్తుచేశారు. రక్షణ విభాగానికి ఎంతమాత్రం ఉపయోగంలేని కార్పొరేట్లకు ఫ్యాక్టరీలను అప్పగించటం దేశ వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలపై ఇప్పటికే రక్షణ విభాగ ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీ

ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని నాలుగు లక్షల మంది రక్షణ విభాగ ఉద్యోగులు, వారి కుటుంబాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు బహిష్క రించడాన్ని సీపీఐ అభినందించింది. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ప్రారంభోత్స వానికి హాజరు కాకుండా ఉద్యోగులకు సంఫీుభావంగా నిలవడాన్ని ఆ ప్రకటనలో రాజా ప్రశంసించారు. ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ప్రభుత్వానికి సీపీఐ విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు. కార్పొరేట్ల పరం చేయడం వల్ల కొత్త కంపెనీల ప్రతికూల ప్రభావం మన దేశ రక్షణ సన్నద్ధతపై చూపుతుందనీ అంతిమంగా తీవ్ర కష్టాలపాలయ్యేది సైన్యమేనని రాజా హెచ్చరించారు.
బీఎస్‌ఎఫ్‌ పరిధి విస్తరణ ఏకపక్షం
సరిహద్దు భద్రతాదళాల (బీఎస్‌ఎఫ్‌) పరిథిని అంతర్జాతీయ సరిహద్దుల నుండి 50 కి.మీ వరకు విస్తరించాలన్న నిర్ణయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం ఖండిరచింది. పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాలకు 15 కి.మీ పరిధి ఉండగా ఇప్పుడు పెంచారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం పాలనలో సమాఖ్య సూత్రాన్ని బరితెగించి ఉల్లంఘించటమే. ఈ నిర్ణయాన్ని పునర్‌పరిశీలించాలనీ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలని సీపీఐ కోరింది.
బంగ్లాలో మత హింసపై ఆందోళన
బంగ్లాదేశ్‌లో అకస్మికంగా మత హింస, ఘర్షణలు తలెత్తడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో మత హింస కార్యకలాపాలు ప్రజలలో శాంతికి, సామరస్యతకు, సఖ్యతకు విఘాతం కలిగిస్తాయని పార్టీ హెచ్చరించింది. మితవాద శక్తులను ఒంటరినిచేసి వారి చర్యలను సాగనివ్వకుండా చేయాలని పార్టీ కోరింది. విచ్ఛిన్నకర మత కార్యకలాపాలను మొగ్గలోనే తుంచి వేసేందుకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోగలదన్న ఆశాభావాన్ని పార్టీ వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img