Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే

భారత సైన్యం నూతన అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. జనరల్‌ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు.దీంతో సైన్యాధ్యక్షుడిగా నరవణే పదవీ కాలం ముగిసినట్టయింది. ఇప్పటి వరకు జనరల్‌ మనోజ్‌ పాండే ఆర్మీ ఉప చీఫ్‌ గా పనిచేశారు. ఎంఎం నరవణే పదవీకాలం ముగియడంతో ఆయనకు పదోన్నతి దక్కింది. చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ నుంచి ఎంపికైన తొలి అధికారి జనరల్‌ పాండే. ఆయన నియామకంపై ప్రకటన వెలువడిన వెంటనే భారత సైన్యం ట్విటర్‌ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. జనరల్‌ నరవణేతోపాటు సైన్యంలోని అన్ని స్థాయులవారు జనరల్‌ పాండేను అభినందిస్తున్నట్లు తెలిపింది. 1962 మే 6న జన్మించిన పాండే.. ఆర్మీకి 29వ అధిపతిగా పనిచేయనున్నారు. 62 ఏళ్ల వరకు లేదంటే మూడేళ్లు ఈ రెండిరటిలో ఏది ముందే అయితే అప్పుటి వరకు పదవిలో కొనసాగుతారని కేంద్రం ప్రకటించింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్మీ చీఫ్‌ గా మనోజ్‌ పాండే బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ వైస్‌ చీఫ్‌ పదవిని మే 1న బీఎస్‌ రాజు చేపట్టనున్నారు. ఆర్మీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ గా ప్రస్తుతం రాజు పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img