Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆస్కార్‌ బరిలో నాటు నాటు

ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేషన్‌

న్యూదిల్లీ : భారతీయ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట ఆస్కార్‌ బరిలో నిలిచింది. ‘లగాన్‌’ తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్‌ అవార్డుకు ఇప్పటివరకు నామినేట్‌ కాలేదు. డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో షానూక్‌సేన్‌ ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’, డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విష్పర్స్‌’ నామినేట్‌ అయ్యాయి. నాటు నాటు పాటను గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించిన విషయం తెలిసిందే. 95వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్ల అధికార ప్రకటనలో ఉత్తమ ఒరిజనల్‌ పాట విభాగంలో నాటు నాటు నామినేటైంది. వివిధ భాషల నుంచి 300 చిత్రాలు ఎంపిక కాగా, అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన చిత్రాలను ఓటింగ్‌ ద్వారా ఆస్కార్‌ జ్యూరీ ఎంపిక చేసింది. నామినేషన్లను నటులు రిజ్‌ అహ్మద్‌, అల్లిసన్‌ విలియమ్స్‌ ప్రకటించారు. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12న లాస్‌ ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరగనున్నాయి.
ఉత్తమ చిత్రం విభాగం: అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌, టాప్‌గన్‌: మావెరిక్‌, ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌, ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌, ఎల్విస్‌, ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, ది ఫేబుల్‌మ్యాన్స్‌, టార్‌జి, ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌, ఉమెన్‌ టాకింగ్‌
ఉత్తమ దర్శకుడు..: మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌), టడ్‌ ఫీల్డ్‌

(టార్‌), రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌)
ఒరిజినల్‌ సాంగ్‌…: నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌), అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌), హోల్డ్‌ మై హ్యాండ్‌ ( టాప్‌గన్‌: మార్వెరిక్‌), లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌), ది ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ సహాయ నటుడు: బ్రెన్డాన్‌ గ్లెసన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), బ్రైయిన్‌ టైరీ హెన్రీ (కాజ్‌వే), జడ్‌ హిర్చ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌), బేరీ కియోఘాన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ సహాయ నటి: ఆంజెలా బాస్సెట్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకండ ఫరెవర్‌), హాంగ్‌ చ్యూ (ది వేల్‌), కెర్రీ కాండన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), స్టెఫానీ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌: బేబీలాన్‌ (మ్యారీ జోఫెర్స్‌), బ్లాక్‌పాంథర్‌: వకండా ఫరెవర్‌ (రూథ్‌కార్టర్‌), ఎల్విస్‌( కేథరిన్‌ మార్టిన్‌), ఎవ్రీథింగ్‌, ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ (షెర్లీ కురాట), మిసెస్‌ హారిస్‌ గోస్‌ టు పారిస్‌ (జెన్నీ బియావాన్‌)
ఉత్తమ సౌండ్‌: ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌, అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌, ది బ్యాట్‌మెన్‌, ఎల్విస్‌, టాప్‌ గన్‌: మావరిక్‌
స్క్రీన్‌ప్లే..: మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, టోనీ కుష్నర్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌), టడ్‌ ఫీల్డ్‌ (థార్‌), రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌).

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img