Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇంధనంకు డిమాండ్‌

మార్చిలో మూడేళ్ల గరిష్ఠానికి అమ్మకాలు
వంట గ్యాస్‌దీ అదే దారి…

న్యూదిల్లీ : దేశ ఇంధన డిమాండ్‌ మూడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. కోవిడ్‌19 మహమ్మారి తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం బాగా పెరిగింది. మార్చి నెలలో ఇంధన డిమాండ్‌ 4.2 శాతానికి చేరినట్లు అధికార గణాంకాలు సోమవారం పేర్కొన్నాయి. మార్చిలో పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం వినియోగం 19.41 మిలియన్‌ టన్నులుగా ఉంది. మార్చి 2019 నాటి నుంచి ఇదే అత్యధికమని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం గణాంకాలు వివరించాయి. కరోనా మహమ్మారి మూడవ తరంగం తీవ్ర ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో మార్చిలో రవాణా ఇంధనానికి డిమాండ్‌ పెరిగింది. దేశంలో అత్యధికంగా వినియోగించే పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం వినియోగంలో దాదాపు 40 శాతం వాటా కలిగి ఉన్న డీజిల్‌ డిమాండ్‌ 7.7 మిలియన్‌ టన్నులకు అంటే 6.7 శాతానికి పెరిగింది. అయితే పెట్రోల్‌ అమ్మకాలు గత కొన్ని నెలల క్రితం కోవిడ్‌ మునుపటి స్థాయిని దాటి 2.91 మిలియన్‌ టన్నులకు (6.1 శాతం) పెరిగింది. మార్చిలో ఈ రెండు ఇంధనాల డిమాండ్‌ కోవిడ్‌ మునుపటి స్థాయి కంటే పెరిగింది. వ్యవసాయ రంగం నుండి బలమైన డిమాండ్‌తో పాటు ధరల పెంపును ఊహించి వినియోగదారులు మరియు పెట్రోల్‌ పంపుల ద్వారా నిల్వ చేయడం వలన డీజిల్‌ వినియోగం ఎక్కువగా ఉంది. అలాగే వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) డిమాండ్‌ మార్చిలో 2.48 మిలియన్‌ టన్నులు (9.8 శాతం) కు పెరిగింది. మార్చి 31, 2022 ముగింపు ఆర్థిక సంవత్సరంలో ఇంధనం డిమాండ్‌ 202.71 మిలియన్‌ టన్నులు (4.3 శాతం) కు పెరిగింది. అంతకుమునుపటి ఆర్థిక సంవత్సరం నుంచి ఇదే అత్యధికం. పారిశ్రామిక ఇంధనంలో క్షీణత ఉనప్పటికీ, ఆటో, వంట గ్యాస్‌ వినియోగం పెరిగింది. 202122లో పెట్రోల్‌ వినియోగం 30.85 మిలియన్‌ టన్నులు (10.3 శాతం) కు, డీజిల్‌ వినియోగం 76.7 మిలియన్‌ టన్నులు (5.4 శాతం) కు పెరిగింది. 2019-20లో 82.6 మిలియన్‌ టన్నుల వినియోగం తర్వాత డీజిల్‌ అమ్మకాలు అత్యధికంగా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌కు డిమాండ్‌ ఎప్పుడూ లేనంతగా ఉంది. ఎల్‌పీజీ వినియోగం 28.33 మిలియన్‌ టన్నులు (3 శాతానికి) పెరిగింది. ఇక విమాన ఇంధనం లేదా ఏటీఎఫ్‌ డిమాండ్‌ 5 మిలియన్‌ టన్నులు (35 శాతం) కు పెరిగింది. పెట్రోలియం బొగ్గు వినియోగం 9.7 శాతం తగ్గి 14.1 మిలియన్‌ టన్నులకు చేరుకోగా, 2022 ఆర్థిక సంవత్సరంలో కిరోసిన్‌ డిమాండ్‌ 17 శాతం తగ్గి 1.5 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. పరిశ్రమలలో ఇంధనంగా ఉపయోగించే నాఫ్తా, అలాగే రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్‌ వినియోగం స్వల్పంగా పెరిగి వరుసగా 14.2, 7.7 మిలియన్‌ టన్నులకు చేరాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img