Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇకపై రూ.5 లక్షల వరకు బదిలీ

ఐఎంపీఎస్‌ ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ పెంపుపై ఆర్బీఐ కీలకనిర్ణయం
డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఎన్నో మార్పులు చేస్తూ వస్తోంది. ఇక మనీ ట్రాన్సాక్షన్‌ విషయంలో కూడా నిబంధనలు కూడా మార్పులు చేస్తూ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐఎంపీస్‌ ద్వారా గరిష్టంగా రూ.2 లక్షల వరకు బదిలీ చేసే వీలుండగా, తాజాగా ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్యాంక్‌ కస్టమర్లు ఐఎంపీఎస్‌ ద్వారా రూ.5 లక్షల వరకు డబ్బులు పంపుకొనే వెలుసుబాటు కల్పించింది. ఆర్‌బీఐ మానెటరీ పాలసీ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడిరచారు.ఐఎంపీఎస్‌ లిమిట్‌ పెంచుతున్నట్టు ప్రకటించారు. ‘ఐఎంపీఎస్‌ సేవల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు మరింత సౌలభ్యకరమైన సేవలను అందించేందుకు ఈ లావాదేవీలపై ఉన్న పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతున్నాం.’ అని ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను వెల్లడిస్తూ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. దీనిపై త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img