Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇక్రిశాట్‌ సరికొత్త సంకల్పంతో ముందుకు సాగాలి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌
రానున్న 25ఏళ్లలో వ్యవసాయ రంగంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సంస్థ సరికొత్త సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న సమయంలో ఇక్రిశాట్‌ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఇక్రిశాట్‌కు అభినందనలు తెలిపిన తోమర్‌.. సరికొత్త వంగడాల సృష్టికి మరిన్ని పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలను కోరారు.ఒకప్పుడు జై జవాన్‌.. జై కిసాన్‌ అనే వారని, అయితే వాజ్‌పేజ్‌ ప్రధాని అయ్యాక జై విజ్ఞాన్‌ను జోడిరచారని..మోడీ ప్రధాని అయ్యాక జై అనుసంధాన్‌ కూడా దానికి జోడిరచారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరోనా సమయంలో ప్రధాని చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ప్రశంసించారు.కోవిడ్‌ సమయంలో తృణధాన్యాల వినియోగం పెరిగిందని తోమర్‌ చెప్పారు. చిరుధాన్యాల దిగుబడి పెంచే దిశగా పరిశోధనలు విస్తృతం చేయాలని తోమర్‌ పిలుపునిచ్చారు.మోదీ ప్రధాని అయ్యాక ప్రతిఏడు బడ్జెట్‌లో దేశానికి కొత్త దిశ సూచిస్తున్నారని తోమర్‌ తెలిపారు. వచ్చే 25 ఏళ్లకు మార్గదర్శనం చేసేలా ఈసారి బడ్జెట్‌ రూపొందించారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img