Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇక ఉచితంగా కరోనా బూస్టర్‌ డోసు

అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో పంపిణీకి ప్రత్యేక కార్యక్రమం
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృభిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం నిర్ణీత ధరలకు ప్రైవేట్‌ కేంద్రాల ద్వారా పంపిణీ అవుతున్న బూస్టర్‌ డోస్‌ ను శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారందరికీ ఉచితంగా బూస్టర్‌ డోస్‌ను అందించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటోన్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగానే బూస్టర్‌ డోస్‌ ఉచిత పంపిణీకి ప్రత్యేక కార్యమాన్ని చేపట్టేందుకు సిద్ధమైందని తెలిపాయి. రెండున్నర నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img