Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఇక వాట్సాప్‌లోనూ టీకా స్లాట్‌ బుకింగ్‌..

కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వీలైనంత వేగంగా టీకాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ బుకింగ్‌ పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజల సౌలభ్యం కోసం మొబైల్‌ ఫోన్లలో ఉండే వాట్సాప్‌ ద్వారానే టీకా స్టాట్‌లు బుక్‌ చేసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ ట్విట్టర్‌లో వెల్లడిరచారు. వాట్సాప్‌ ద్వారా టీకా బుక్‌ చేసుకునే పద్ధతి.. పౌరల సేవలో కొత్త యుగానికి నాంది పలుకుతున్నాం అని మంత్రి పేర్కొన్నారు. మీ ఫోన్లలోనే చాలా సులువైన రీతిలో కొవిడ్‌ టీకా బుకింగ్‌ చేసుకోవచ్చని, కేవలం నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. దీంతోపాటు వాట్సప్‌ ద్వారా ఎలా బుక్‌ చేసుకోవాలో ఆయన వివరించారు. వాట్సాప్‌లోని మైగవర్నమెంట్‌ఇండియా కరోనా హెల్ప్‌డెస్క్‌కు బుక్‌ స్టాట్‌ అని మెసేజ్‌ చేయాలి. ఓటీపీతో వెరిఫై చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img