Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇక సమరమే

మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు సంఘటితం
కదంతొక్కిన రైతులు
భారీ ప్రదర్శనలు, రైలు, రాస్తారోకోలు
భారత్‌బంద్‌ విజయవంతం

న్యూదిల్లీ / చండీగఢ్‌ / నోయిడా : కేంద్రప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న 10 నెలల రైతాంగ పోరాటానికి మద్దతుతో పాటు కోట్లాది మంది కార్మికుల ప్రయోజనాలను కాలరాసే లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం తేవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వద్దని, ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్ని పెంచాలని, పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలని కూడా ఎస్‌కేఎం డిమాండు చేస్తోంది. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తమ డిమాండ్ల సాధన కోసం భారత్‌ బంద్‌ ద్వారా సమరానికి శంఖంపూరించినట్లు నిరసనకారులు వెల్లడిరచారు. అనుకున్నది సాధించేంత వరకు వెనకడుగు వేయబోమని పాలకులకు భారత్‌ బంద్‌ ద్వారా రైతుకార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. 500కుపై రైతు, కార్మిక, ప్రజా సంఘాలు భారత్‌ బంద్‌లో పాల్గొని దానిని విజయవంతం చేశాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ బంద్‌కు సంఫీుభావం తెలిపాయి. కాంగ్రె స్‌, వామపక్షాలు సహా 19 పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌, తమిళనాడు ప్రభుత్వాలు, ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫడరేషన్‌్‌ మద్దతిచ్చాయి. భారత్‌ బంద్‌ దృష్ట్యా దేశ రాజధాని దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు. కొత్త సాగు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా 40 రైతు సంఘాల ఐక్యవేదిక ఎస్‌కేఎం ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా, దిల్లీతో పాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో రైతులు పెద్దఎత్తున తరలివచ్చి బంద్‌ను జయప్రదం చేశారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించిపోయి ంది. ఘాజీపూర్‌ వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు దిల్లీమీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను దిగ్బంధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిచ్చారు. ఇండియాగేట్‌, విజయ్‌ చౌక్‌ సహా ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హరియాణాలోని శంభు సరిహద్దును రైతులు దిగ్బంధించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించారు. పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో రైల్వే ట్రాకులపై రైతులు బైఠాయించారు. రహదారులను దిగ్బంధించారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ రైతులకు అండగా నిలవడంతో అక్కడ బంద్‌ విజయవంతంగా జరిగింది. దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాలన్నీ మూతబడ్డాయి. అమృత్‌సర్‌, రూప్‌నగర్‌, జలంధర్‌, పఠాన్‌కోట్‌, సంగ్రూర్‌, మొహాలి, లూధియానా, ఫిరోజ్‌పూర్‌, భటిండా సహా అనేక జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులను నిరసనకారులు దిగ్బంధించారు. హరియాణాలోనూ సిర్సా, ఫతేప్‌ాబాద్‌, కురుక్షేత్ర, పానిపట్‌, హిస్సార్‌, చర్ఖీ దాదర్‌, కర్నాల్‌, కైథల్‌, రొహతక్‌, రaాజర్‌, పంచ్‌కులా జిల్లాల్లో రహదారులను రైతులు దిగ్బంధించారు, రెండు రాష్ట్రాల్లో రైల్‌ రోకో.. రాస్తా రోకోలు జరిగాయి. కురుక్షేత్ర సమీపంలోని షాబాద్‌, సోనిపట్‌, బహదూర్‌ ఘర్‌, చర్ఖిదాద్రి, జింద్‌, అమృత్‌సర్‌, పాటియాలా, బర్నాలా, దేరాబస్సీ దగ్గర లాల్రూ సహా రెండు రాష్ట్రాలకు చెందిన అనేక రైల్వే ట్రాకులపై రైతులు బైఠాయించారు. కోల్‌కతా నుంచి వచ్చే 03005 యూపీ హౌరా మెయిల్‌ను రైల్వే అధికారులు ఉదయం 6.35 గంటలకు నిలిపివేయగా, జమ్మూకు చెందిన 08237 యూపీ బేగంపురా ఎక్స్‌ప్రెస్‌ను ఉదయం 6.46 గంటలకు ఆపేశారని ఫగ్వారా స్టేషన్‌ సూపరింటెండెంట్‌ దేవిందర్‌ సింగ్‌ వెల్లడిరచారు. బేగంపురా ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్‌ లేకపోయినా జలంధర్‌ వద్ద ట్రాక్‌లను రైతులు దిగ్బంధించడంతో రైలు ఆగాల్సి వచ్చిందన్నారు. అమృత్‌సర్‌కతిహార్‌ ఎక్స్‌ప్రెస్‌, ది సహర్సాఅమృత్‌సర్‌ ఎక్స్‌ప్రెస్‌, ఉచాహర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అంబాలా కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ వద్ద అంబాలాసహరన్‌పూర్‌ ప్యాసింజర్‌ రైళ్లూ జగధ్రీ రైల్వే స్టేషన్‌ వద్ద, జమ్మూకు వెళ్లే స్వరాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ను కర్నాల్‌ రైల్వే స్టేషన్‌లో నిలిపివేయగా మరో మూడు రైళ్లు కురుక్షేత్ర రైల్వే స్టేషన్‌లో ఆగినట్లు అధికారులు వెల్లడిరచారు. వందలాది మంది రైతులు అంబాలాదిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించారు. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దుకు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు మధ్యలో బైఠాయించారు. దీంతో దిల్లీ హైవే రెండు వైపులా పెద్దఎత్తున ట్రక్కులు, వాహనాలు బారులుదీరాయి. అంబాలా నగరంలోని గ్రెయిన్‌ మార్కెట్‌లో దుకాణాలను మూసివేయాలని రైతులు కోరారు. హోల్‌సేల్‌ వస్త్ర మార్కెట్‌, సరాఫా బజార్‌, విద్యాసంస్థలు, అనేక వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. హరియాణాలోని కర్నాల్‌, కురుక్షేత్రలోనూ చాలా దుకాణాలను మూసివేశారు. అమృత్‌సర్‌లోని స్వర్ణాలయం వద్ద రైతులు భారీ నిరసన నిర్వహించారు. దిల్లీలోని ఎర్రకోట, ఛత్తా రైల్‌, సుభాష్‌ మార్గ్‌ వైపు ట్రాఫిక్‌ను మళ్లించినట్లు దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. జాతీయ రహదారి 24, ఎన్‌హెచ్‌9లను నిరసనకారులు దిగ్బంధించడంతో సరాయి కాలే ఖాన్‌ నుంచి వచ్చే వారంతా ఘజియాబాద్‌కు వెళ్లేందుకు వికాస్‌ మార్గ్‌ను ఎంచుకోవాలనిÑ నోయిడా వెళ్లాలంటే డీఎన్‌డీ వైపుగా వెళ్లాలని ట్విట్టర్‌ ద్వారా ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. ఘాజీపూర్‌ సరిహద్దును మూసివేసినట్లు తెలిపారు. ఎన్‌హెచ్‌ 24, 9 మార్గాల్లో ట్రాఫిక్‌ను మహారాజ్‌పూర్‌, అప్సరా, భోపురా సరిహద్దులకు మళ్లించినట్లు ట్వీట్‌ చేశారు. యూపీదిల్లీ ఘజియాబాద్‌ సరిహద్దుల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులతో పాటు ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కాన్స్‌టబులరీ (పీఏసీ)ని మోహరించి, ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్‌ఎస్పీ పవన్‌ కుమార్‌ తెలిపారు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. మోదీనగర్‌ వద్ద ‘రాజ్‌ టాకీస్‌’ను దిగ్బంధిస్తామని రైతులు ప్రకటించడంతో పార్టపూర్‌, మీరత్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ వైపు సాగే వాహనాలను దారి మళ్లించినట్లు పోలీసులు చెప్పారు. ఘాజీపూర్‌ వద్ద యూపీ గేటు, దిల్లీఘజియాబాద్‌ మధ్య మూడు సరిహద్దుల వద్ద ఆంక్షలు ఉండగా ఆనంద్‌ విహార్‌, దిల్షాద్‌ గార్డెన్‌, అప్సరా సినిమా, తుల్సినికేతన్‌ తెరిచే ఉన్నాయని ఎస్పీ జ్ఞానేంద్ర సింగ్‌ వెల్లడిరచారు. యుమునా ఎక్స్ప్‌ఎస్‌ వే (గ్రేటర్‌ నోయిదా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథురా, ఆగ్రా, అలీఘర్‌, లక్నోల గుండా సాగే) తెరిచే ఉందన్నారు. గ్రేటర్‌ నోయిడాలో వందలాది మంది భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) సభ్యులు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై భారీ ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌, బాగ్‌పట్‌, హాపుర్‌, బులంద్‌షెహర్‌లోనూ ప్రదర్శనలు జరిగాయి. బాగ్‌పట్‌లో రైతు సంఘాలకు రాష్ట్రీయ లోక్‌దళ్‌ మద్దతిచ్చింది. ముజఫర్‌నగర్‌లో దిల్లీడెహ్రాడూన్‌ జాతీయ రహదారిని రాంపూర్‌ తిరాహా, చాపర్‌, నవ్లా కోఠి వద్ద బీకేయూ కార్యకర్తలు దిగ్బంధించారు. మీరట్‌కర్నాల్‌ హైవేను వైవాలా చెక్‌పోస్టు వద్ద, ఖాతిమాపానిపట్‌ హైవేను బాగ్రా బ్లాక్‌ పరిధిలోని లాలుఖేరి వద్ద, మోర్నా, జన్‌సాథ్‌, మిరాన్పూర్‌, షాపూర్‌ల వద్ద రహదారులనూ రైతులు దిగ్బంధించారు. ఇదిలావుంటే, దిల్లీలోని అనేక వర్తక సంఘాలు, ఆటో, ట్యాక్సీ యూనియన్లు భారత్‌ బంద్‌కు మద్దతిచ్చాయి. ట్రేడ్‌ యూనియన్లలోని ఓ వర్గం, పౌర సంఘాలు సంయుక్తంగా జంతర్‌మంతర్‌ వద్ద నిరసన ద్వారా రైతులకు సంఫీుభావం తెలిపాయి. ‘లాంగ్‌ లివ్‌ ఫార్మర్స్‌ యూనిటీ’ బ్యానర్లను నిరసనకారులు ప్రదర్శించారు. నల్ల చట్టాల రద్దు, అందరికీ సమాన అవకాశాలకు డిమాండు చేశారు. టిక్రీ సరిహద్దు వద్ద దిల్లీ మెట్రో స్టేషన్‌ను భద్రతా కారణాల రీత్యా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 25 రైళ్లకు అంతరాయం కలిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో దిల్లీఅమృత్‌సగర్‌ షానే పంజాబ్‌, న్యూదిల్లీమోగా ఎక్స్‌ప్రెస్‌, ఓల్డ్‌దిల్లీపయ్‌హాజోట్‌ ఎక్స్‌ప్రెస్‌, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, న్యూదిల్లీ`కాట్రా, అమృత్‌సర్‌ శాతాబ్ది ఉన్నాయన్నారు. దిల్లీ,అంబాలా, ఫిరోజ్‌పూర్‌ డివిజన్లలో 20కుపైగా స్థానాల్లో దిగ్బంధనలు కొనసాగినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. దిల్లీ ఆటో ట్యాక్సీ యూనియన్‌, సర్వోదయ డ్రైవర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ దిల్లీ, రాష్ట్రీయ రాజధాని క్షేత్ర ఆటో డ్రైవర్స్‌ అసోసియేషన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్త్రీ (సీటీఐ), కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) ప్రత్యక్షంగా, పరోక్షంగా బంద్‌కు మద్దతిచ్చాయి. ఇదిలావుంటే, తమిళనాడులోని చెన్నైలోని అన్నా సలై ప్రాంతంలో పోలీసు బారికేడ్‌ను నిరసనకారులు తొలగించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
చర్చలతో ప్రయోజనం లేదనందునే..: తికైత్‌
భారత్‌ బంద్‌ నేపథ్యంలో అంబులెన్సులు, డాక్టర్లు సహా అత్యవసర సేవలకు అంతరాయం కలిగించలేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ తికైత్‌ అన్నారు. కేంద్రంతో ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో సాగు చట్టాల ప్రస్తావన రాలేదన్నారు. చర్చల వల్ల ఫలితం లేదని భావించే భారత్‌ బంద్‌ చేపట్టామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img