Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇదో ప్రమాదకరమైన విధానం


కొవిడ్‌ టీకాల కాంబినేషన్‌పై డబ్ల్యూహెచ్‌ఓ
వేర్వేరు తయారీదార్లు చేసిన టీకాలను కాంబినేషన్‌ రూపంలో తీసుకోవడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇదో ప్రమాదకరమైన విధానమని ఈ సంస్థ డైరెక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ పేర్కొన్నారు. దీనివల్ల ఆరోగ్యంపై ఇది చూపే ప్రభావానికి సంబంధించి డేటా ఏదీ లేదన్నారు. ఇప్పటివరకు ఇలాంటి డేటా అందుబాటులో లేదని ఆమె చెప్పారు. అందువల్ల ఇది చాలా రిస్కుతో కూడిన విషయమని తెలిపారు. ప్రజలే సొంతంగా ఎప్పుడు, ఎవరు రెండు, మూడు లేదా నాలుగో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవాలో నిర్ణయించుకుంటే అలాంటి దేశాలు ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఫైజర్‌ లేదా మోడెర్నా టీకామందు తీసుకోవచ్చా అన్న విషయమై నిపుణులు ఇంకా రీసెర్చ్‌ చేస్తున్నట్టు చెప్పారు.
వాస్తవానికి ఇప్పటికే పలు దేశాధినేతలు కూడా రెండు వేర్వేరు టీకాలు తీసుకున్నారు. కొన్ని దేశాల్లో ఈ సమ్మేళన విధానాన్ని అమలుచేశారు.ప్రస్తుతం ఓ డోసు టీకామందు తీసుకున్నాం..రెండో డోసు ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలని చాలామంది తమను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అయితే దీని గురించి ఇంకా రీసెర్చ్‌ జరుగుతోంది..అయినా ఇదే డేంజరస్‌ ట్రెండ్‌ అని భావిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img