Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇప్పటంవాసులకు హైకోర్టులో చుక్కెదురు

రిట్‌ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం
గతంలో 14మందికి రూ.లక్ష చొప్పున జరిమానా

గుంటూరు జిల్లా ఇప్పటం వాసులకు మరోసారి ఏపీ హైకోర్టు లో చుక్కెదురైంది. గతంలో 14మంది పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున హైకోర్టు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. పిటిషనర్ల ఇళ్లను కాపాడుకోవాలన్న ఉద్దేశమేనని లాయర్‌ అన్నారు. పిటిషనర్లు అంతా రైతులేనని.. వాళ్లకు తెలియక తప్పు చేశారు అన్నారు. ‘వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారేగా మీకు తెలియదా’ అంటూ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేయటం మంచిది కాదంది. పెనాల్టీని తగ్గించాలని అభ్యర్థించిన పిటిషనర్‌ తరపు లాయర్‌ కోరగా.. పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఇప్పటంవాసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఇళ్ల నిర్మాణాల తొలగింపునకు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడిరది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నారని సీరియస్‌ అయ్యింది. తమ దగ్గర వాస్తవాలను దాచి స్టే తీసుకున్నందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదోనని వ్యాఖ్యానించింది. కచ్చితంగా ఇదంతా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనంది.పిటిషన్లు వేసిన వారి తరపు లాయర్‌ కూడా నిర్మాణాల తొలగింపుపై తమకు అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చారని ఒప్పుకోడం విశేషం. దీంతో పిటిషనర్లపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. నిర్మాణాల తొలగింపుపై స్టేను పొడగించలేదు. ఆ తర్వాత కోర్టుకు హాజరైన 14మంది తమకు ఈ వ్యవహారంపై అవగాహన లేదని చెప్పారు. దీంతో కోర్టు విచారణ జరిపి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14మందికి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img