Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇలాంటి ప్రధాన మంత్రిని మీరేమని పిలుస్తారు?

నాలుగు ఆప్షన్స్‌ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు.దేశంలో ద్రవ్యోల్బణాన్ని, చొరబాటుదారులను నియంత్రించలేని ప్రధాని
మీరేమని పిలుస్తారు? అని ట్వీట్‌ చేశారు. ప్రజలకు నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్తను ట్వీట్‌కు యాడ్‌ చేశారు. శాటిలైట్‌ ఫొటోలతో సహా ఒక జాతీయ మీడియా ఈ వార్తను ప్రచురించింది. కేటీఆర్‌ ఇచ్చిన నాలుగు ఆప్షన్లు ఇలా ఉన్నాయి.
ఏ) 56’’
బి) విశ్వ గురు
సి) అచ్చేదిన్‌ వాలే
డి) పైవన్నీ అన్‌పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి
అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img