Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇలా అయితే ఎలా?

చెల్లింపులు ఆలస్యమైతే కాంట్రాక్టర్లు ఎలా ముందుకొస్తారు ?
సీఎస్‌ను ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు సకాలంలో చెల్లించకపోతే ఎలాగని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా అయితే కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు వస్తారని అడిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు నెలల తరబడి చెల్లింపులు చేయడం లేదు. దీంతో ఇటీవల కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడిరది. చేసిన పనులకే బిల్లులు చెల్లించడంలేదు… కొత్తవాటిని చేపట్టి మళ్లీ చేతులు కాల్చుకోలేమంటూ ప్రభుత్వ అధికారులకు కాంట్రాక్టర్లు బహిరంగంగానే తెగేసి చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన కొంతమంది కాంట్రాక్లర్లు హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. తాము చేసిన బిల్లులకు ప్రభుత్వం చెల్లింపులు చేయకపోతే తమకు ఆత్మహత్యే గతి అని, అప్పులపాలయ్యామని కోర్టుకు తమ ఆవేదన వ్యక్త్తం చేశారు. దీనిపై గతంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, మంగళవారం సీఎస్‌ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో సీఎస్‌ సమీర్‌ శర్మ కోర్టుకు హాజరుకాగా, హైకోర్టు పై విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సీఎస్‌ వివరణ ఇస్తూ… ప్రాధాన్యతా క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నామని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, బిల్లుల చెల్లింపును 9వ ప్రాధాన్యతగా పెడుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇకనైనా బిల్లులు సకాలంలో చెల్లించేలా కార్యదర్శులకు ఆదేశాలివ్వాలని సీఎస్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img