Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇవిగో..ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలు : రాహుల్‌గాంధీ

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో ఎంతమంది రైతులు మరణించారని నవంబరు 30న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని ప్రశ్నించగా.. అందుకు సంబంధించిన డేటా తమ వద్ద లేదని చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలను లోక్‌సభకు అందిస్తున్నా అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వెల్లడిరచారు. రైతుల ఉద్యమంలో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో పంజాబ్‌ నుంచి దాదాపు 400 మంది రైతులున్నారని తెలిపారు. మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రైతులకు హక్కులు కల్పించాలని, మరణించిన రైతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.వారికి పంజాబ్‌ ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పరిహారం అందించింది. హరియాణా నుంచి మరణించిన రైతుల వివరాలు లేవని బిజెపి ప్రభుత్వం చెబుతోంది. ఆ జాబితా కూడా సభలో ఇస్తున్నట్లు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img