Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఈసారి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలకు ఏ విధానం?

న్యూదిల్లీ: 2022-23 విద్యా సంవత్సరంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు రెండు విడతలుగానే నిర్వహిస్తారా లేక తిరిగి సింగిల్‌ బోర్డ్‌ ఎగ్జామ్‌ విధానంలోకి మారుస్తారా అనేది సీబీఎస్‌ఈ ఇంకా నిర్ణయించలేదని సంబంధిత అధికారులు శుక్రవారం తెలిపారు. కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 2021`2022 లో 10, 12 బోర్డు పరీక్షలకు సీబీఎస్‌ఈ ప్రకటించినట్లుగా ప్రత్యేక మూల్యాంకన అంచనా పథకంలో భాగంగా విద్యా సంవత్సరాన్ని విభజించడం, రెండు టర్మ్‌-ఎండ్‌ పరీక్షలను నిర్వహించడం, సిలబస్‌ను హేతుబద్ధీకరించడం వంటివి ఉన్నాయి. అయితే కొత్త విద్యాసంవత్సరానికి ఇదే విధానాన్ని కొనసాగించాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదు. ‘కరోనాతో ఏర్పడిన అసాధారణ స్థితిలో 2020-21 అకడమిక్‌ సెషన్‌కు బోర్డు పరీక్షలు నిర్వహించనందున ప్రత్యామ్నాయ మూల్యాంకన పథకాన్ని ఉపయోగించి విద్యార్థులను అంచనా వేయాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బోర్డు పరీక్షలను రెండు దఫాలుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోబడిరది. ఈ చర్యను వన్‌-టైమ్‌ చర్యగా ప్రకటించారు’ అని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇక కొత్త విద్యాసంవత్సరానికి ఇది పొడిగించాలా లేదా అనే దానిపై నిర్ణయం సరైన సమయంలో తీసుకోబడుతుందని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో మొదటి టర్మ్‌ బోర్డు పరీక్ష జరగ్గా, రెండవ టర్మ్‌ బోర్డు పరీక్ష ఏప్రిల్‌ 26 నుండి ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img