Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈ నెలలోనే థర్డ్‌వేవ్‌ ప్రారంభం

మునుపటి ఉధృతి ఉండకపోవచ్చు
నిపుణుల అంచనా

కరోనా రెండో దశ ఉధృతి నుంచి ఇక బయటపడనేలేదు..థర్డ్‌వేవ్‌ ఈ నెల (ఆగస్ట్‌)లోనే ప్రారంభమవుతుందని అక్టోబర్‌ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు దారితీస్తుందని హైదరాబాద్‌, కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ప్రొఫెసర్లు మతుకుమల్లి విద్యాసాగర్‌, మణీంద్ర అగర్వాల్‌ నేతృత్వంలోని పరిశోధనా బృందం తెలిపింది.మేథమేటికల్‌ మోడల్‌ ప్రకారం.. థర్డ్‌ వేవ్‌పై అంచనా వేశారు. భారత్‌లో మొదటి వేవ్‌? రెండో వేవ్‌ ఏ స్థాయిలో వచ్చింది? ఆ రెండిరటి మధ్య ఎంత సమయం? ఇలా పలు కోణాలపై నిపుణులు అధ్యయనం చేశారు. మేథమేటికల్‌ మోడల్‌ మేరకు దేశంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, హాట్‌స్పాట్లలో ట్రాకింగ్‌ పద్ధతులు అమలు చేయాలని, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.భారత్‌లో సెకండ్‌ వేవ్‌కు డెల్టా వేరియంట్‌ కారణమని పేర్కొంటున్న నిపుణులు.. థర్డ్‌ వేవ్‌కు కూడా అదే వేరియంట్‌ కారణమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 132 దేశాలకు డెల్టా వేరియంట్‌ విస్తరించగా.. అమెరికా, జపాన్‌, మలేషియాతో పాటు పలు దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. మేనెలలో రోజువారీ మరణాలు 4,500పైనే వెలుగుచూశాయి. అయితే సెకండ్‌ వేవ్‌ స్థాయి విజృంభణ ఉండకపోవచ్చని చెబుతున్నారు. థర్డ్‌వేవ్‌లో అత్యధికంగా లక్షకంటే తక్కువ కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితి చేయిదాటితే ఆ సంఖ్య గరిష్టంగా లక్షాయాబైవేలుగా కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img